ఓటు మనందరి హక్కు. కాబట్టి మన ఓటు భద్రంగా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మీకు ఓటర్ కార్డ్ గాని లేకపోతే కేవలం రెండు నిమిషాల్లో ఆన్లైన్ ద్వారా మీరు ఓటర్ కార్డును సులభంగా పొందవచ్చు. ఓటర్ కార్డ్ ని ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో పూర్తి విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు ఓటు కార్డు లేనట్లయితే కింది లింకు ద్వారా అప్లై చేసుకోవచ్చు
STEP : ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ని సందర్శించండి
ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇప్పటికే అకౌంట్ ఉన్నట్టయితే లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి లేదంటే Sign Up ఆప్షన్ పైన క్లిక్ చేయండి
లాగిన్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే కింది విధంగా లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది
Sign up పైన క్లిక్ చేసిన తరువాత కింది విధంగా ఇది ఓపెన్ అవుతుంది ఇందులో మీ వివరాలను నమోదు చేసి ఎలక్షన్ వెబ్సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు.
క్రియేట్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి, Captcha కోడ్ ఎంటర్ చేసి, Request OTP పైన క్లిక్ చెయ్యండి.
OTP request చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసి Verify & Login పైన క్లిక్ చెయ్యండి.
లాగిన్ అయిన తరువాత కింది విధంగా Home Page ఓపెన్ అవుతుంది. ఇప్పుడు E-EPIC Download ఆప్షన్ పైన క్లిక్ చెయ్యండి.
E-EPIC Download ఆప్షన్ పైన క్లిక్ చేసిన తరువాత EPIC no (Voter ID) తో గాని, Reference No తో గాని ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ ఓటర్ కార్డు లోని EPIC Number ఎంటర్ చెయ్యండి.
తరువాత మీ స్టేట్ ని ఎంచుకొని, Search పైన క్లిక్ చెయ్యండి.
Search పైన క్లిక్ చేసిన, తరువాత Send OTP పైన క్లిక్ చెయ్యాలి. క్లిక్ చెయ్యగానే మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. ఆ ఓటీపీ ని ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చెయ్యండి.
ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి అయినా తరువాత Download e-EPIC పైన క్లిక్ చెయ్యండి.
డౌన్లోడ్ చేసిన తరువాత కింది విధంగా e-ఓటర్ కార్డు ఓపెన్ అవుతుంది.
Leave a Reply