ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలను ఎన్నో విధాలుగా ఆదుకోవడానికి అనేక పథకాలను అమలు చేస్తుంది.
స్వయం సహాయక సంఘాలలో రుణం తీసుకొన్న మహిళలపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించింది.
స్వయం సహాయక సంఘాలలో మహిళల అర్హతలకు అనుగుణంగా బ్యాంకుల ద్వారా రుణాలను ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు వడ్డీ అధికంగా ఉంటుంది. ప్రతి నెల డ్వాక్రా మహిళలు కొంత రుణ మొత్తాన్ని మరియు వడ్డీని బ్యాంకులకు చెల్లిస్తున్నారు. మహిళలు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం పలు విడతలలో మహిళల ఖాతాల్లో తిరిగి చెల్లిస్తుంది. దీని ద్వారా మహిళలపై ఎటువంటి వడ్డీ భారం పడదు.
ఈ ఏడాదికి గాను వైయస్సార్ సున్నా వడ్డీ పథకం నిధుల విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రితో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైయస్సార్ సున్నా వడ్డీ నిధులను 26న విడుదల చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించింది.
అయితే తాజాగా ఈ నిధులను ఎక్కడ ఎప్పుడు విడుదల చేస్తారు అనే సమాచారంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 26న అమలాపురం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ సున్నా వడ్డీ అమౌంటును డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రకటించిన అమలాపురం లో అధిక వర్షాల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది.
ఆగస్టు 10న వైయస్ఆర్ సున్నా వడ్డి పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
ఈ ఏడాది దాదాపు 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులలోని మహిళలకు దాదాపు 1353.78 కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు.
గత నాలుగేళ్లలో ప్రభుత్వం దాదాపు 5వేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో వడ్డీ రూపంలో జన చేయడం జరిగింది.
Leave a Reply