వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ముమ్మరంగా కొత్త దరఖాస్తులు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
వాహన మిత్ర 2023 24 సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్
పాత లబ్ధిదారులకు అర్హత ఉన్నప్పటికీ ప్రస్తుతం సచివాలయాల వెరిఫికేషన్ జాబితాలో పేరు రాకపోతే, అటువంటి లబ్ధిదారులకు మరల కొత్త దరఖాస్తు తీసుకోవాలని సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
పాత లబ్ధిదారులు ఒకవేళ తమ వాహనం అమ్మేసి కొత్త వాహనం కొన్నట్లయితే అటువంటివారు తిరిగి కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
పాత లబ్ధిదారుల వెరిఫికేషన్ సమయంలో తప్పనిసరిగా వాహనంతో నిలబడి తీసినటువంటి ఫోటోను సచివాలయాల వెరిఫికేషన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మిగిలిన పాత లబ్ధిదారులు తిరిగి మరల అప్లై చేయాల్సిన అవసరం లేదు.
కొత్త దరఖాస్తుదారులకు ఎవరికైతే వాహనానికి సంబంధించి లైసెన్స్ ఆర్ సి కార్డులు ఎక్స్పైర్ అయినట్లయితే వారి వెరిఫికేషన్ సిక్స్ స్టెప్ ధ్రువీకరణ లో జరుగుతుంది, అయితే వారి అప్లికేషన్ మాత్రం స్వీకరించాలి.
వీరికి వాహన మిత్ర పథకం వర్తించదు
ఎవరైతే కళ్ళుగీత కార్మికులు, చర్మకార వృత్తి చేస్తూ సామాజిక పెన్షన్ పొందుతున్నారు వారికి వాహన మిత్ర పథకం వర్తించదు.
అంగన్వాడి ఆశ కార్యకర్తలకు సంబంధించి కూడా కాపు నేస్తం వాహన మిత్ర వంటి పథకాలు వర్తించవు, వారి కుటుంబ సభ్యులలో ఎవరైనా అర్హత ఉన్న వారు ఉంటే వారికి మాత్రం పథకం వర్తిస్తుంది.
వాహన మిత్ర దరఖాస్తు చివరి తేదీ
వైయస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ప్రస్తుతం కొత్త అప్లికేషన్స్ మరియు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ జరుగుతుంది. కొత్త అప్లికేషన్స్ కి సంబంధించి చివరి తేదీని రాష్ట్ర ప్రభుత్వం జులై 25 గా నిర్ణయించడం జరిగింది.
Vahana Mitra Application Last Date : 25.07.2023
వైయస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి అన్ని అప్డేట్స్, లింక్స్ కింది పేజ్ ద్వారా పొందగలరు
Leave a Reply