ఏపీ క్యాబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు

ఏపీ క్యాబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. మూడున్నర గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 55 అంశాలపై చర్చించినట్లు సమాచారం.

  • అనైన్డ్ ల్యాండ్ కలిగిన రైతులకు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేలా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంతో క్రయ విక్రయాలపై పూర్తి హక్కులు రైతులకు అందనున్నాయి.
  • మొత్తం 63,191,84 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ మరియు లంక భూములు కలిపి మొత్తం 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం. ఒరిజినల్ అసైన్డ్ రైతులకు మాత్రమే ఇది వర్తించనుంది. ఒకవేళ వారు మరణిస్తే వారి వారసులకు వర్తిస్తుంది
  • 1966 గ్రామాల్లో ఎస్సీలకు స్మశాన వాటికల నిర్మాణాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్ పర్చేస్ స్కీం కింద దళితులకు ఇచ్చిన 16,213 ఎకరాలకు కట్టాల్సిన రుణాలు మాఫీకి ఆమోదం. ఈ నిర్ణయంతో పూర్తి హక్కులు పొందనున్న లబ్ధిదారులు.
  • వైయస్సార్ సున్నా వడ్డీ అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • కేంద్రం ఇదివరకే ఆమోదం తెలపడంతో అమరావతి పరిధిలోని 47 వేల సీఆర్డీఏ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్యాబినెట్.
  • విశ్వవిద్యాలయాల్లో పనిచేసే శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం.
  • ఎస్ ఐ పీ బీ సమా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
  • అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • దేవాదాయ శాఖ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం.
  • జూలై నెలలో చేపట్టబోయే జగనన్న తోడు, జగనన్న విదేశీ విద్యా దీవెన , నేతన్న నేస్తం, వైయస్సార్ సున్నా వడ్డీ పథకాలకు ఆమోదం తెలిపింది.

Click here to Share

You cannot copy content of this page