డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం అమౌంట్ విడుదల తేదీ ఖరారు

డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకం అమౌంట్ విడుదల తేదీ ఖరారు

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న ఋణాలను సక్రమంగా తిరిగి చెల్లించుటకు మరియు వారిపై పడిన వడ్డీ భారాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకాన్ని వైఎస్ఆర్ సున్నా వడ్డీగా అమలు చేస్తున్నది

ఈ పథకం అమలు వల్ల స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల ద్వారా మరింత ఋణాన్ని పొందడానికి
మరియు వారు స్థాపంచిన చిన్న తరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా వడ్డీ భారం లేకుండా నడవడానికి మెరుగైన జీవనం సాగించడానికి దోహదపడుతుంది

ఈ నెల 26న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు డబ్బు జమ చేయనుంది. వరుసగా నాలుగో ఏడాది పంపిణీ చేపట్టనున్నారు. 9.48 లక్షల గ్రూపు లోని మహిళలకు ఈ పథకం కింద రూ.1,353.78 కోట్లు ఇవ్వనున్నారు.

ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు అక్కచెల్లెమ్మలకు ఇచ్చినట్లవుతుంది.

వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు అప్డేట్స్ కోసం కింది లింకును క్లిక్ చెయ్యండి

Click here to Share

You cannot copy content of this page