ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబరు అందించింది. ఆర్థిక సహకారం అందించి అండగా నిలబడేందుకు ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల తేదీలను ఖారారు చేసింది.
ఈ ఏడాదికి సంభందించి ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఈ నెల 8 న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటనలో భాగంగా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏ సీజన్‌లో పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసే లోపు రైతుల చేతికి పరిహారం అందిస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ప్రతి అడుగు ముందుకు వేస్తున్నారు. ప్రతి అన్నదాతకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.
అదే రోజున 10.2 లక్షల మందికి ఉచిత పంటల బీమా అమౌంట్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అభ్యంతరాలను రైతు భరోసా కేంద్రాల వద్ద స్వీకరించడం జరిగింది. జూన్ 8వ తేదీన ఈ రెండు పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించి రైతుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు.
ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది చదవండి: ఉచిత పంటల బీమా అమౌంట్ విడుదల చేసిన ముఖ్యమంత్రి
Leave a Reply