Amma Vodi EKYC: అమ్మఒడి పథకానికి సంబంధించి మీకు ఈ కేవైసీ పూర్తి కాలేదా అయితే ఈ వివరాలు చెక్ చేయండి.

Amma Vodi EKYC: అమ్మఒడి పథకానికి సంబంధించి మీకు ఈ కేవైసీ పూర్తి కాలేదా అయితే ఈ వివరాలు చెక్ చేయండి.

జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఈకెవైసి తీసుకునే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. పలు చోట్ల కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటం వలన కొంత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

రేపు జగనన్న అమ్మ ఒడి పథకం నిధులను విడుదల చేయనున్న నేపథ్యంలో ఇంకా ఒక్క రోజు మాత్రమే ఈకేవైసి కోసం మిగిలి ఉంది. కావున లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఇటువంటి వారికి అమ్మఒడి EKYC సంబంధించి ముఖ్య సమాచారం

⁉️అమ్మ ఒడి రేపు అనగా జూన్ 28 న విడుదల కానున్న నేపథ్యంలో ఇంకా ఈ కేవైసీ పూర్తికాని వారి సంగతేంటి?


కొన్ని సాంకేతిక సమస్యలు లేదా డేటా రాని కారణంగా ఈసారి కొంతమంది ఈ కేవైసీ ఇంకా పూర్తి కాలేదు. అటువంటివారు కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఈసారి అమ్మ ఒడి కార్యక్రమం జూలై మొదటి వారం వరకు కొనసాగనుంది. సాధ్యమైనంత వరకు ఈరోజు పూర్తి చేయండి. డేటా లేని కారణంగా లేదా సాంకేతిక సమస్యలు ఉన్నవారికి 28 తర్వాత ఈ కేవైసీ చేసినచో, ఆ అమౌంట్ జూలై మొదటి వారంలో జరగనున్న వారోత్సవాల సమయంలో జమవుతుంది.

అమ్మ ఒడి సంబంధించి కొంతమంది పేర్లు ఇంకా ఎందుకు రాలేదు

పాఠశాలల నుంచి కొంతమంది డేటా ఇంకా సచివాలయాలకు అందలేదు ఇందు కారణంగా ఇప్పటికీ కొంతమంది డేటా రావడం లేదు. డేటా వచ్చిన తర్వాత ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు.

కొంతమంది 6 స్టెప్ ధ్రువీకరణ సమయంలో ఫెయిల్ అయి ఉండవచ్చు.

ఇందుకు సంబంధించి సచివాలయం లో వెంటనే గ్రీవెన్స్ పెట్టండి.

అమ్మ ఒడి సంబంధించి ఎలిజిబుల్ ఉన్నప్పటికీ ఎలిజిబుల్ లేదా ఇనెలిజిబుల్ లిస్ట్ లో పేరు లేదు

అటువంటి వారికి సచివాలయం లో గ్రీవెన్స్ ఆప్షన్ ఇచ్చారు.

Please raise grievance in sachivalayam

అమ్మ ఒడికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టిన వారి డేటా ఎప్పుడు వస్తుంది

అమ్మ ఒడి 2023 24 పథకానికి సంబంధించి పేర్లు రానివారు గ్రీవెన్స్ పెట్టినచో వారి డేటా త్వరలోనే ఈ కేవైసీ కొరకు చూపించే అవకాశం ఉంది.

అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ కేవైసీ చివరి తేదీ ఎప్పుడు?

ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు జూలై 10వ తేదీ వరకు కూడా ఈకేవైసీ ఆప్షన్ వాలంటీర్ల వద్ద అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఈ కేవైసీ చేసేటప్పుడు తల్లి లేని వారికి తల్లి తండ్రులు లేని వారికి ఏం చేయాలి?

తల్లి లేని వారికి తండ్రి యొక్క ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు లేనివారికి గార్డియన్ యొక్క ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది.

అమ్మ ఒడి ఈ కేవైసీ యాప్ , యూజర్ manual మరియు డాష్ బోర్డ్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి

అమ్మ ఒడి పథకానికి సంబంధించి మీ ఈకేవైసీ పూర్తి అయిందా లేదా చెక్ చేసేందుకు కింది లింక్ క్లిక్ చేయండి

అమ్మ ఒడి పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ను కింది లింక్ ద్వారా చెక్ చేయండి

ఇది చదవండి: నేడే అమ్మఒడి నాలుగో విడత అమౌంట్ విడుదల.. పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి

Click here to Share

9 responses to “Amma Vodi EKYC: అమ్మఒడి పథకానికి సంబంధించి మీకు ఈ కేవైసీ పూర్తి కాలేదా అయితే ఈ వివరాలు చెక్ చేయండి.”

  1. Neelam satavika Avatar
    Neelam satavika

    Very good

  2. Neelam satavika Avatar
    Neelam satavika

    Very good 👍👍

  3. N.anusha Avatar
    N.anusha

    My name is not in cluster amma vodi.up to last year I took ammavodi money

  4. Bhavani prasad Avatar
    Bhavani prasad

    Good

  5. Ramprasad Avatar
    Ramprasad

    1st class pillale ration card lo undaru dadapu cm valaku anyam cheyaku valalo oka childe chadevaluntaru valaku vere option pettandi sir please

  6. N sunitha Avatar
    N sunitha

    My ammavadistetus

  7. N nagamma Avatar
    N nagamma

    K. S.thanda madakasira. Anantapur ditick

  8. Krupakar Avatar
    Krupakar

    Not came amma vadi money

  9. Chekuri Balasudaraju Avatar
    Chekuri Balasudaraju

    Description

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page