రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఈ ఏడాది అమౌంట్ ను ముఖ్యమంత్రి ఈనెల 28న విడుదల చేయనున్నారు. 28న మన్యం జిల్లా కురుపాం పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు అమ్మఒడి నిధులను జమ చేయనున్నారు.
అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో వారోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జూన్ 30 నుంచి జూలై 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో అమ్మ ఒడి వారోత్సవాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కేవైసీ ప్రక్రియ
గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో లబ్ధిదారుల నుంచి ఈ కేవైసీ తీసుకునే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. సచివాలయంలో గాని లేదంటే మీ వాలంటీర్ ను సంప్రదించైనా గాని లబ్ధిదారులు తమ ఈ కేవైసీ ని పూర్తి చేయవచ్చు.
ఈ కేవైసీ ప్రక్రియలో భాగంగా విద్యార్థి మరియు తల్లి యొక్క వివరాలను సేకరించడం జరుగుతుంది. చివర్లో తల్లి యొక్క EKYC లేదా బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది
తల్లి లేని వారికి తండ్రి యొక్క బయోమెట్రిక్, తల్లిదండ్రులు ఇద్దరు లేనివారికి గార్డియన్ అన్న యొక్క ఈ కేవైసీ తీసుకోవడం జరుగుతుంది.
ఇది చదవండి: EKYC ఇంకా పూర్తి కాలేదా? అయితే ఈ సమాచారం మీ కోసమే
అమ్మ ఒడి ఈ కేవైసీ ప్రక్రియ కు సంబంధించి సచివాలయం బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ మరియు ఏ విధంగా ఈకేవైసి పూర్తి చేయాలో డాక్యుమెంట్ ను కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
లబ్ధిదారుల తుది జాబితా ఎప్పుడంటే
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను గ్రామ వార్డు సచివాలయాలలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈసారి పది రోజులపాటు అమ్మ ఒడి కార్యక్రమం కొనసాగనున్న నేపథ్యంలో కేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున లబ్ధిదారుల తుది జాబితా ekyc పూర్తి అయిన సచివాలయాల వారిగా సిద్ధం కానుంది. ఈ జాబితాను తర్వాత పాఠశాలల వారీగా విడుదల చేయనున్నారు.
అయితే అమ్మ ఒడి పథకానికి సంబంధించి మీకు అర్హత ఉందో లేదో ఎలిజిబిలిటీ కింద ఇవ్వబడిన అప్లికేషన్ స్టేటస్ లింక్ ద్వారా చెక్ చేయండి. అందులో ఎలిజిబుల్ అని ఉంటే మీకు అమౌంట్ వస్తుంది.
అమ్మ ఒడి పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ మరియు పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి
జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి కింది ప్రాసెస్ ను ఫాలో అయ్యి లబ్ధిదారులు తమ అప్లికేషన్ లేదా పేమెంట్ స్టేటస్ ను సులభంగా ఆన్లైన్లో చెక్ చేయవచ్చు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కింద ఇవ్వబడిన టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి.
Leave a Reply