రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరికైనా అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకపోయినా, సర్టిఫికెట్లు అందకపోయినా ఈ పథకం ద్వారా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయనుంది.
ఇప్పటికే ప్రారంభమైన ఇంటింటి సర్వే
గ్రామ వార్డు వాలంటీర్లు, సిబ్బంది, సంబంధిత అధికారులు మరియు ఔత్సాహితులతో ఇంటింటి సర్వే ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ సర్వే నిర్వహించడం కోసం గ్రామ వార్డు వాలంటీర్లకు యాప్ ద్వారా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అర్హత ఉన్నా ఏవైనా పథకాలు అందడం లేదా? సర్టిఫికెట్ల జారీ విషయంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వంటి అంశాలను సర్వే చేసి ముందుగా ఇంటింటి సర్వేలో భాగంగా వీటిని నమోదు చేయడం జరుగుతుంది.
ఈ విధంగా ఎవరికైనా సమస్యలు ఉంటే సచివాలయంలో ఒక టోకెన్ ని జనరేట్ చేసి వీరికి ఇవ్వడం జరుగుతుంది.
టోకన్ ద్వారా ఎప్పుడైతే తమ సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారో ఆ సమయంలో లబ్ధిదారులు సచివాలయాన్ని సందర్శించి సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవచ్చు.
జూలై 1 నుంచి నెల రోజులపాటు సచివాలయాలలో సురక్ష క్యాంపులు
జూలై 1 నుంచి మండల స్థాయి అధికారులతో రెండు టీములుగా ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలో క్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 15,004 సచివాలయాలలో 15004 క్యాంపులను నిర్వహిస్తారు.
మండల స్థాయిలో తహసిల్దార్, పిఆర్డి లతో ఒక టీం ను, ఎంపీడీవో మరియు డిప్యూటీ తాహసిల్దారులతో మరొక టీమ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
వీరు సచివాలయాలలో క్యాంపులు నిర్వహించేటప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వెంటనే ప్రభుత్వ పథకాలకు సంబంధించి మంజూరు చేయడం కానీ లేదా సర్టిఫికెట్ల జారీ అంశంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సత్వరమే ఎటువంటి రుసుము లేకుండా సర్టిఫికెట్లను జారీ చేయటం వంటివి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డు కి సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ మరియు కొత్త రేషన్ కార్డు జారీ లను కూడా ప్రాధాన్యత అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది.
కాబట్టి చాలా రోజులకు పరిష్కారం కానటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా రేషన్ కార్డుకు సంబంధించి సమస్యలు ఉన్న సంక్షేమ పథకాలకు సంబంధించి
జగనన్న సురక్ష పథకానికి సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్లికేషన్స్ అన్ని కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply