వాలంటీర్ అప్లికేషన్ లో జగనన్న సురక్ష సర్వే షెడ్యూల్ చేయబడిన తేదీకి వారం రోజులు ముందు ప్రారంభం అవుతుంది.
వాలంటీర్ జగనన్న సురక్ష సర్వే చేసి, ప్రజలకు అవసరమయ్యే సర్వీసులు గుర్తించి వాటికి సంబందించిన డాక్యుమెంట్స్ సేకరించాలి. ఏవైనా డాక్యుమెంట్స్ లో సందేహాలు ఉంటే సచివాలయం ను సంప్రదించాలి. వాలంటీర్ లబ్ధిదారులకు డాక్యుమెంట్స్ తయారీ లో సహకారం అందించాలి.
టోకెన్లు జారీ
వాలంటీర్ అప్లికేషన్ లో సర్వే మాత్రమే జరుగుతుంది. టోకెన్ జెనరేట్ అవ్వదు అనే విషయాన్ని గుర్తించండి. వాలంటీర్ లబ్దిదారులు కావలసిన సర్వీసులు గుర్తించి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ సమగ్ర పరిచి డిజిటల్ అసిస్టంట్ లేదా వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టంట్ లేదా గ్రామ రెవెన్యూ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి వారి ఏపీ సేవ పోర్టల్ లో టోకెన్ జారీ చేయాలి.
ప్రతి సర్వీసుకు ఒక టోకెన్ జారీ అవుతుంది.
టోకెన్ జారీ అయిన తరువాత డిజిటల్ అసిస్టంట్ లాగిన్ లో సర్వీస్ అప్లయ్ చేయాలి (పాత పద్ధతి లోనే, ముందు టోకెన్ జెనరేట్ అయ్యి ఉంటే సర్వీస్ ఛార్జ్ లు ఉండవు)
డిజిటల్ అసిస్టంట్ లాగిన్ లో సర్వీస్ కూడా ఇవ్వాలి కనుక టోకెన్ జారీకి మిగిలిన లాగిన్లు అనగా (WEA/VRO/PS) లకు ప్రాధాన్యం ఇవ్వండి.
టోకెన్ జారీ, సర్వీస్ రిక్వెస్ట్ షెడ్యూల్ తేదీకి వారం ముందు నుంచి ప్రారంభం చేయవచ్చు. కానీ సర్టిఫికెట్స్ క్యాంప్ జరిగిన తేదీన ప్రింట్ ఇవ్వాలి.
టోకెన్ క్యాంప్ తేదీ వరకే చెల్లుబాటు లో ఉంటుంది.
జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ సేవలు
జగనన్న సురక్ష క్యాంప్ లో ఆధార్ డ్రైవ్ కూడా జరుగుతుంది. ఇందులో ఆధార్ కార్డ్ మొబైల్ లింకింగ్ కొరకు మాత్రమే టోకెన్ జారీ చేయాలి. తప్పని సరి బయోమెట్రిక్ అప్డేట్ సర్వీస్ కొరకు మరియు ఇతర సర్వీస్ ల కొరకు టోకెన్లు జారీ చేయవలసిన అవసరం లేదు. ఆధార్ లో మొబైల్ అప్డేట్, తప్పని సరి బయోమెట్రిక్ అప్డేట్ మాత్రమే ఉచితంగా అందించబడతాయి.
ఆధార్ సెంటర్ ఉన్న డిజిటల్ అసిస్టంట్ లకు అన్ని క్యాంప్ లకు డ్యూటీలు వేయబడతాయి. ఆధార్ సెంటర్ ఉన్న సచివాలయం లో వారం ముందు నుంచి జరిగే టోకెన్ రిజిస్ట్రేషన్ మరియు సర్వీస్ రిక్వెస్ట్ కొరకు WEA మరియు ఇంఛార్జి అరేంజ్మెంట్స్ చేయబడతాయి.
Leave a Reply