ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ మరియు ఇంటర్మీడియట్ లో టాపర్లుగా నిలిచిన వారికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు [ Jagananna Animutyalu ] కార్యక్రమం ద్వారా అవార్డులు నగదు పురస్కారాలు సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికి నియోజకవర్గస్థాయిలో జూన్ 15న జిల్లా స్థాయిలో జూన్ 17న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించగా ఈరోజు ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడలో జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
అవార్డులు అందుకున్న టాపర్స్
పదో తరగతిలో మరియు ఇంటర్మీడియట్లో ప్రభుత్వ పాఠశాలలు లేదా రెసిడెన్షియల్, మోడల్ , ట్రైబల్ తదితర ప్రభుత్వ పరిధిలో ఉండే పాఠశాలల్లో టాపర్లు గా ఉన్న వారికి ఈ అవార్డులను ప్రధానం చేయడం జరుగుతుంది.
నియోజకవర్గం జిల్లా రాష్ట్రస్థాయి కలుపుకొని మొత్తం 22,710 మందికి ఈ ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు పేరుతో అవార్డులు నగదు పురస్కారాలు అందించడం జరిగింది.
రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో నేరుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా స్టేట్ టాపర్స్ ఈ అవార్డులను అందుకున్నారు.
రాష్ట్రస్థాయిలో వివిధ క్యాటగిరీలలో పదవ తరగతి టాపర్స్ గా నిలిచిన 42 మంది ఇంటర్మీడియట్లో గ్రూప్ ల వారిగా టాపర్స్ సత్తా చాటినటువంటి 26 మంది విద్యార్థులకు నేరుగా ముఖ్యమంత్రి సత్కరించడం జరిగింది. వీరితోపాటు ఉన్నత విద్యలో ఐదు కేటగిరీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు స్టేట్ ఎక్ష్కెల్లెన్త అవార్డులను కూడా విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి ప్రధానం చేయడం జరిగింది.
జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా నగదు పురస్కారం ఎంత ఇస్తారు? టాపర్స్ లిస్ట్
ఈ పథకం ద్వారా నియోజకవర్గం, జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ఎంత అమౌంట్ ఇస్తారంటే
నియోజకవర్గం స్థాయిలో టాప్ మూడు ర్యాంకులు సాధించిన వారికి మొదటి బహుమతిగా 15000, రెండో బహుమతిగా పదివేలు, మూడో బహుమతిగా 5000 నగదు పురస్కారం అందిస్తారు అదేవిధంగా ఇంటర్మీడియట్ లో నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి టాపర్ కు 15000 చొప్పున నగదు అందించడం జరుగుతుంది.
ఇక జిల్లా స్థాయిలో మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన వారికి మొదటి స్థానంలో ఉన్న వారికి 50,000 రెండో స్థానంలో ఉన్నవారికి 30,000 మూడో స్థానంలో ఉన్న వారికి 15000 నగదు అందిస్తారు. ఇక ఇంటర్మీడియట్ కి సంబంధించి టాపర్ గా ఉన్నటువంటి ఒక విద్యార్థికి 50 వేలు నగదు అందిస్తారు.
ఇక రాష్ట్రస్థాయిలో టాప్ 3 ర్యాంక్స్ లో ఉన్నటువంటి టెన్త్ విద్యార్థులకు మొదటి స్థానంలో ఉన్న వారికి లక్ష రూపాయలు రెండవ స్థానంలో ఉన్న వారికి 75 వేల రూపాయలు మూడో స్థానంలో నిలిచిన వారికి 50 వేలను బహుమతిగా ఇస్తారు. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే 4 ఇంటర్ గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూప్ కి సంబంధించి ఒక టాపర్ లెక్కన లక్ష చొప్పున అమౌంట్ ఇస్తారు ఈ విధంగా ఇంటర్మీడియట్లో ప్రాసెస్ స్థాయిలో 35 మంది టాపర్లు ఉన్నారు.
టాపర్స్ లిస్ట్ కింది లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి
Leave a Reply