Jagananna Animutyalu Scheme 2023

#

Jagananna Animutyalu Scheme





ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, నగదు పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. "జగనన్న ఆణిముత్యాలు" అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

అసలు ఏంటి ఈ జగనన్న ఆణిముత్యాలు? ఎవరికి వర్తిస్తుంది

టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలలో టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు రివార్డులను ఈ పథకం ద్వారా పథకం ద్వారా అందించనుంది. అయితే కేవలం ప్రభుత్వ పాఠశాలలో లేదా కళాశాలలో చదివే విద్యార్థులతో మాత్రమే ఇది వర్తిస్తుంది. మెరిట్ సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం, మెరిట్ సర్టిఫికెట్, మెడల్ ఇచ్చి సత్కరిస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులను విద్యార్థులు తల్లిదండ్రులను కూడా సత్కరిస్తారు.

కండిషన్స్ ఏంటి?

టెన్త్ లో నియోజకవర్గం వారీగా టాప్ 3 ర్యాంకులు సాధించిన వారికి, అదే విధంగా జిల్లా స్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో టాప్ 3 ర్యాంక్స్ సాధించిన వారికి ఈ సన్మానం ఉంటుంది.

ఇంటర్మీడియట్ లో ప్రతి గ్రూప్ లో టాప్ మార్కులు సాధించిన టాపర్ కి అవార్డును ఇవ్వనున్నారు. మీకు కూడా పైన పేర్కొన్న విధంగా నియోజకవర్గం జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ఎంపిక ఉంటుంది.

ఒకవేళ సమన మార్కుల తోటి ఎవరైనా టాపర్లు ఉంటే వారందరూ కూడా అర్హులే.

ఇటీవల విడుదల అయిన టెన్త్ రిజల్ట్స్ లో భాగంగా నియోజకవర్గం స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు 602 మంది ఉండగా , జిల్లా స్థాయిలో 606 మంది, ఇక రాష్ట్రస్థాయిలో టాప్ త్రీ మార్కులు సాధించిన విద్యార్థులు 38 మంది మొత్తం కలిపి టెన్త్ లో 1246 మంది విద్యార్థులకు ఈ సత్కారం ఉంటుంది.

ఇక ఇంటర్మీడియట్ స్థాయిలో టాప్ వన్ మార్క్ సాధించినటువంటి వారు నియోజకవర్గంలో స్థాయిలో 750 మంది జిల్లా స్థాయిలో 800 మంది రాష్ట్ర స్థాయిలో 30 మంది మొత్తం కలిపి 1585 మంది విద్యార్థులు ఉన్నారు.

ఓవరాల్ గా చూసినట్లయితే 2831 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు.

ఏం పురస్కారం అందిస్తారు? ఎంత అమౌంట్ రివార్డుగా ఇస్తారు?

నియోజకవర్గం స్థాయిలో టాప్ మూడు ర్యాంకులు సాధించిన వారికి మొదటి బహుమతిగా 15000, రెండో బహుమతిగా పదివేలు, మూడో బహుమతిగా 5000 నగదు పురస్కారం అందిస్తారు అదేవిధంగా ఇంటర్మీడియట్ లో నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి టాపర్ కు 15000 చొప్పున నగదు అందిస్తారు.

ఇక జిల్లా స్థాయిలో మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచిన వారికి మొదటి స్థానంలో ఉన్న వారికి 50,000 రెండో స్థానంలో ఉన్నవారికి 30,000 మూడో స్థానంలో ఉన్న వారికి 15000 నగదు అందిస్తారు. ఇక ఇంటర్మీడియట్ కి సంబంధించి టాపర్ గా ఉన్నటువంటి ఒక విద్యార్థికి 50 వేలు నగదు అందిస్తారు.

ఇక రాష్ట్రస్థాయిలో టాప్ 3 ర్యాంక్స్ లో ఉన్నటువంటి టెన్త్ విద్యార్థులకు మొదటి స్థానంలో ఉన్న వారికి లక్ష రూపాయలు రెండవ స్థానంలో ఉన్న వారికి 75 వేల రూపాయలు మూడో స్థానంలో నిలిచిన వారికి 50 వేలను బహుమతిగా ఇస్తారు. ఇక ఇంటర్మీడియట్ విషయానికి వస్తే 4 ఇంటర్ గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూప్ కి సంబంధించి ఒక టాపర్ లెక్కన లక్ష చొప్పున అమౌంట్ ఇస్తారు ఈ విధంగా ఇంటర్మీడియట్లో ప్రాసెస్ స్థాయిలో 35 మంది టాపర్లు ఉన్నారు.

ఈ పురస్కారాలను ఎప్పుడు ఇస్తారు?

ఈ పురస్కారాలను మే 25వ తేదీన నియోజకవర్గం స్థాయిలో, మే 27 న తేదీన జిల్లా స్థాయిలో, మే 31న రాష్ట్ర స్థాయిలో జగనన్న ఆణిముత్యాల పేరుతో ఈ వేడుకను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రస్థాయిలో జరిగే వేడుకకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #