ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే 6000 .. మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకం

ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే 6000 .. మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకం

దేశంలో ఆడ శిశువుల జననాల రేటును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి మిషన్ శక్తి రూప కల్పన చేసింది.

ఎవరికైనా రెండోసారి గర్భం దాల్చినపుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి 6000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2022 ఏప్రిల్ నెల నుండి ఈ పథకాన్ని వర్తింప చేయనున్నట్లు తెలిపారు. రెండో కాన్పులో కవలలు పుట్టి అందులో ఒక అమ్మాయి ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది.

బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా నగదును మహిళకు చెల్లిస్తారు. మొదటిసారి గర్భం దాల్చిన వారికి ఇదివరకే మంత్రి మాతృ వందన యోజన కింద ఇప్పటికే 5000 చెల్లిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిని సవరిస్తూ కేంద్రం మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పు కి కూడా అమౌంట్ చెల్లించనుంది.

మిషన్ శక్తి పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూర్చాలని ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.

మాతృ వందన యోజన పథకం సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం కింది లింక్ చెక్ చేయండి

మిషన్ శక్తి పథకానికి సంబంధించి అన్ని సందేహాలు సమాధానాలు

Click here to Share

7 responses to “ఇకపై రెండో కాన్పులో అమ్మాయి పుడితే 6000 .. మిషన్ శక్తి కింద కేంద్రం కొత్త పథకం”

  1. J sandhaya Avatar
    J sandhaya

    Ok

  2. Amarapallisrinivas Avatar
    Amarapallisrinivas

    మాకు మొదట అబ్బాయి రెండోసారి అమ్మాయి మాకు వర్తిస్తుందా మా పాపకి ఏడు సంవత్సరాలు

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      Yes

  3. Hema Avatar
    Hema

    Maku edhari adapillale china papaki 10nths varthusthunda

    1. schemesstudybizz Avatar
      schemesstudybizz

      2022 april tarvata putti unte option undi. Mi local asha worker ni adagandi

  4. pradeep kumar Avatar
    pradeep kumar

    మిషన్ శక్తీ కింద అమ్మాయి పుదితే ఎలా అప్లై చేయాలి చెప్పండి

  5. Battini Karnakar Avatar
    Battini Karnakar

    Maaku mood kanpulo ammayi puttindi dob 09/10/2017 maa papaki varthisthunda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page