ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు తర్వాత పాఠశాలలో తిరిగి జూన్ 12న ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది.అదే రోజున పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామంలో జగనన్న విద్యా కానుక కిట్లను ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు.
అకాడమిక్ క్యాలెండర్ 2023 24 [ AP Academic Calendar 2023-24]
అకాడమిక్ క్యాలెండర్ లో భాగంగా పాఠశాలల టైమింగ్స్ ఇన్స్ట్రక్షన్స్, ముఖ్యమైన తేదీలు మరియు హాలిడేస్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించడం జరిగింది.
ఈ క్యాలెండర్ను ప్రైమరీ ఎడ్యుకేషన్ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ కు వేరువేరుగా ప్రచురించడం జరిగింది.
ఈ ఏడాది దసరా సెలవులు : 14 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ వరకు ఇవ్వడం జరుగుతుంది
మిషనరీ స్కూల్స్ కి క్రిస్టమస్ సెలవులను 17 డిసెంబర్ నుంచి 26 డిసెంబర్ వరకు ఇచ్చారు.
ఇక సంక్రాంతి సెలవులు జనవరి 9 2024 నుంచి 18 జనవరి వరకు ఇవ్వడం జరిగింది.
Leave a Reply