జూన్ నెలలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాబినెట్ ఆముదం తెలిపింది.
జూన్ నెలలో మొత్తం మూడు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. వీటిలో జగనన్న విద్యా కానుక, జగనన్న ఆణిముత్యాలు, జగనన్న అమ్మ ఒడి పథకాలు ఉన్నాయి.
జూన్ నెలలో ఏ పథకాలు ఎప్పుడంటే
పాఠశాలలో ప్రారంభమవుతూనే విద్యార్థులకు ఆరు రకాల వస్తువులను అందించేటటువంటి జగనన్న విద్యా కానుక ఈ ఏడాది పథకాన్ని జూన్ 12న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఇక జూన్ 20 న పదో తరగతి మరియు ఇంటర్ లో టాప్ మార్కులు సాధించిన వారికి అవార్డులు రివార్డులు అందించేటటువంటి జగనన్న ఆణిముత్యాలు పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.
ఇక జూన్ 28న జగనన్న అమ్మ ఒడి పథకం – ఒకటి నుంచి 12వ తరగతి చదివే పిల్లల తల్లుల ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేసేటటువంటి అమ్మ ఒడి ఈ ఏడాది నిధులను ముఖ్యమంత్రి 28న విడుదల చేయనున్నారు.
Leave a Reply