ఏపీలో పిఎం కిసాన్ రైతు భరోసా ఈ ఏడాది తొలి విడత అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ ఏడాది మొదటి విడత అమౌంట్ విడుదల చేసిన ముఖ్యమంత్రి.
రాష్ట్రవ్యాప్తంగా 52.39 లక్షల మంది రైతుల ఖాతాలో 7500/- చొప్పున 3923.21 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
అదేవిధంగా 47,999 మంది రైతుల ఖాతాలో 44.19 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ను కూడా ముఖ్యమంత్రి బటన్ నొక్కి విడుదల చేశారు
RYTHU BHAROSA AMOUNT RELEASED
ఎంత అమౌంట్ జమ అవుతుంది?
ఈ ఏడాదికి సంబంధించి ఈ నెల మొదటి విడత వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ ₹5500 రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. అయితే 2000 PM కిసాన్ అమౌంట్ కేంద్రం జమ చేసిన తర్వాత నే ఖాతాలో పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసే 5500 మాత్రమే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి.
వైయస్సార్ రైతు భరోసా కోసం కొత్త రిజిస్ట్రేషన్ లను గత నెల నుంచి మే 18 వరకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీరికి కూడా తాజాగా విడుదల అయినటువంటి విడత లో అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
వైయస్సార్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ స్టేటస్ లింక్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి.
Click below link for rythu bharosa and PM kisan status
ముఖ్య గమనిక: మీకు స్టేటస్ లో ‘Payment Under Processing ‘ అని ఉంటే ఒకటి లేదా రెండు రోజుల్లో మీ ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది. ఆ తరువాత Payment Succes అని మారుతుంది
మీ ఆధార్ తో రైతు భరోసా పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Leave a Reply