రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమూల్ తో పాల సేకరణ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అమూల్ తన పాల సేకరణ ధరలను పెంచుతూ వస్తుంది. గత 30 నెలలలో వరుసగా ఏడో సారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తద్వారా పాడి రైతులకు మరింత గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది.
పాల ధరలను ఎంత పెంచారు?
పాల నాణ్యత ఆధారంగా లీటర్ పాలకు కింది విధంగా ధరలను పెంచడం జరిగింది
గేద పాలు : 5.5 కొవ్వు శాతం ఉంటే ₹42.40 నుంచి ₹43.50 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే లీటరు కు ₹1.10 ను పెంచారు.
ఇక ఆవు పాలు 3.2 కొవ్వు శాతం ఉంటే 0.91 రూపాయి పెంచి 35.11 రూపాయలు ఇస్తున్నారు , అదేవిధంగా ఆవుపాలు 5.4 కొవ్వు శాతం ఉంటే ఒకటి పాయింట్ 1.13 రూపాయలను పెంచి 43.69 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది.
అదే విధంగా వెన్న పై 20 రూపాయలు, ఘనపదార్థాల పై ఎనిమిది రూపాయలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పెంపు సోమవారం నుంచే అమల్లోకి రావడం జరిగింది.
జగనన్న పాల వెల్లువ కి సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ పొందటానికి కింది లింక్ ని ఫాలో అవ్వండి
Leave a Reply