🥛 జగనన్న పాల వెల్లువ పథకం - అమూల్ రైతులకు గుడ్ న్యూస్.. లీటర్ గేదె పాలు 2.20 రూపాయలు పెంచిన ప్రభుత్వం, ఆవు పాలు 1.14 రూపాయలు పెంపు.
Jagananna pala Velluva 2.5 direct apk
For DA/VA/WEA/WWDS, Secretary,Assistant Secretary, Technician, RIC/ Mentor
Jagananna pala Velluva Login Link
For DA/VA/WEA/WWDS, Secretary,Assistant Secretary, Technician, RIC/ Mentor
జగనన్న పాల వెల్లువతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నారు. 2020 నవంబరులో ఈ పథకాన్నిప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. తొలి విడతగా 201 గ్రామాల్లో పాలకేంద్రాలు ప్రారంభించారు. అనంతరం మరో 41 కేంద్రాలను విస్తరింపజేశారు. 242 గ్రామాల్లోని పాల వెల్లువ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 10 వేల లీటర్ల పాలు సేకరించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జిల్లాలో 37.12 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అందుకుగాను రూ.19.18 కోట్లు మహిళా పాడి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.
పాలుపోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ద్వారా చేయూతనిస్తున్నారు. అలాగే ఎక్కువ మోతాదులో పాలు ఇచ్చే ముర్రా జాతి గేదెలతో పాటు ఇతర మేలు రకం జాతి గేదెల కొనుగోలు చేపట్టారు. వర్కింగ్ కాపిటల్ కింద ఒక్కొక్క గేదెకు ప్రధాన మంత్రి పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.30 వేలు చొప్పున, మరో రూ.70 వేలు బ్యాంకు ద్వారా అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 178 మంది మహిళా రైతులకు రూ.1.52 కోట్లు రుణాల రూపంలో ఇచ్చారు. సహకార బ్యాంకుతో పాటు కమర్షియల్ బ్యాంకుల ద్వారా 194 మంది మహిళా పాడి రైతులకు రూ.2.02 కోట్లు, అదేవిధంగా సెర్ప్ ద్వారా 792 మందికి రూ.7.33 కోట్లు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తంగా జిల్లాలో మహిళా పాడి రైతులు 1,164 మందికి రూ.10.53 కోట్లు ఇచ్చారు.
జగనన్న పాల వెల్లువ కేంద్రాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరో వైపు పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జగనన్న పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా 210 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు, 201 మెట్రిక్ టన్నుల దాణామృతం (టీఎంఆర్) అందించనున్నారు. అలాగే 40 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసే ఛాప్ కట్టర్స్‌ను రైతులకు ఇస్తున్నారు. జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి మేలుజాతి పశువుల ఉత్పత్తి కోసం 2020–21 సంవత్సరంలో 110 శాతం లక్ష్య సాధనతో జిల్లాలో 4.50 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో కనీసం 10 దేశీయ పశువులు కలిగి కృత్రిమ గర్భధారణ సౌకర్యంలేని రైతులకు జిల్లాలో 55 ఆబోతు దూడలను ఉచితంగా అందజేయనున్నారు.
⦿ వాలంటీర్ తన మొబైల్ లో పై లింక్ ద్వారా జగనన్న పాల వెల్లువ ( volunteer) యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
⦿ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి
⦿ పాలవెల్లువకు సంబందించిన లాగిన్స్ రూట్ ఇంచార్జెస్, మెంటార్స్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ కి ఇవ్వడం జరిగింది.
⦿ లాగిన్స్ కి సంబంధించిన డాష్ బోర్డు నందు ఏ వాలంటీర్ లాగిన్ అయ్యారో ఏ వాలంటీర్ లాగిన్ అవ్వలేదో తెలుసుకొనవచ్చును. కావున ప్రతి volunteer లాగిన్ అవ్వాలి.
⦿ తేదీ 12.11.2021 న ప్రతి వాలంటీర్ కూడా టెస్టింగ్ సర్వే చెయ్యాలి
⦿ ఈ టెస్టింగ్ సర్వే చేసిన హౌస్ హోల్డ్స్ డేటా అనేది తరువాత రోజున ఉదయం ఆరు గంటలకు తీసివేయటం జరుగుతుంది.
⦿ 13.11.2021 ప్రతి వాలంటీర్ జగనన్న పాలవెల్లువ సర్వే తప్పనిసరిగా మొదలుపెట్టాలి. సర్వే ముగిసిన తరువాత DA లాగిన్ లో అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన ప్రతి సర్వే కి కూడా 8 డిజిట్ కోడ్ జనరేట్ అవుతుంది.
⦿ ఒకవేళ వాలంటీర్ తప్పుగా సర్వే చేసినచో DA ఆ హౌసేహోల్డ్ ని పుష్ బ్యాక్ చేసి మళ్ళీ volunteer చేత సర్వే చేయించాలి. 8 డిజిట్ కోడ్ జనరేట్ ఐన తరువాత రూట్ ఇంచార్జి, మెంటార్,AD అనిమల్ హస్బెండరీ, జేడీ అనిమల్ హస్బెండరీ వారు మీటింగ్ ఎప్పుడు నిర్వహించాలో తెలుపుతారు.