ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సేవా అవార్డుల ను ప్రధానం చేస్తున్న విషయం తెలిసిందే, ఇందులో భాగంగా వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 19న నిర్వహించనుంది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మే 19న వాలంటీర్లకు అవార్డుల ప్రధానొత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు.
అయితే ఇందుకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ , జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలను జారీ చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా Volunteer Appreciation Program
మే 19న ముఖ్యమంత్రి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత నుంచి నెల రోజుల్లో ఈ సన్మాన కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను మే 18 నాటికి ఖరారు చేయాలని తెలిపారు.
ప్రతి రోజు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం లో రెండు సచివాలయాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా ఈ కార్యక్రమానికి కావలసినటువంటి శాలువాలు బ్యాడ్జీలు, మెడల్స్, సర్టిఫికెట్లు ఇప్పటికే జిల్లా హెడ్ క్వార్టర్స్ కు పంపించినట్లు తెలిపారు. వీటిని షెడ్యూల్ ప్రకారం ఆయా సచివాలయాలకు ముందుగానే చేర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.
వాలంటీర్లకు మూడు క్యాటగిరిలలో అనగా సేవా మిత్రా (₹10000), సేవ రత్న (₹20000) , సేవ వజ్ర (₹30000) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు మరియు సత్కారాలు చేస్తున్న విషయం తెలిసిందే.
సేవా అవార్డులకు సంబంధించి కలెక్టర్లకు జారీ చేసిన ఆదేశాలు కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఇప్పటివరకు అందుబాటులో ఉన్నటువంటి సేవా అవార్డుల లిస్ట్
గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి సేవ అవార్డుల లిస్టు కింది లింక్ లో చెక్ చేయండి
వాలంటీర్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు?అర్హతలు ఏంటి?
వాలంటీర్ అవార్డులను మొత్తం మూడు రకాలుగా ఇవ్వటం జరుగుతుంది.
- సేవా మిత్ర (Seva Mitra)
- సేవా రత్న (Seva Ratna)
- సేవా వజ్ర (Seva Vajra)
సేవా మిత్ర (Seva Mitra)
అర్హతలు : 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు. సేవా రత్న, వజ్ర లో ఉన్నవారు మినహా అర్హత ఉన్న మిగిలిన వాలంటీర్లు అందరికీ ఈ అవార్డ్ ఇస్తారు
నగదు : ₹10,000/-
సేవా రత్న (Seva Ratna)
ఎవరికి ఇస్తారు : మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను మరియు మునిసిపల్ కార్పొరేషన్ కు 10 వాలంటీర్లకు అందిస్తారు.
అర్హతలు :
- 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
- వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
- హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు.
నగదు : ₹20,000/- తో పాటు మెడల్, బ్యడ్జ్, శాలువా, సర్టిఫికేట్ ఇస్తారు
సేవా వజ్ర (Seva Vajra)
ఎవరికి ఇస్తారు : నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు.
అర్హతలు :
- 1 సంవత్సరం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.
- వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.
- హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు.
నగదు : ₹30,000/- తో పాటు మెడల్, బ్యడ్జ్, శాలువా, సర్టిఫికేట్ ఇస్తారు
అవార్డులకు సంబంధించి ప్రభావితం చేసే ఇతర అంశాలు
- వాలంటీర్ల పనితీరు సంతృప్తికరంగా ఉండాలి
- గడపగడపకు మన ప్రభుత్వం లో వాలంటీర్ల భాగస్వామ్యం
- మొదటి రోజే పూర్తిస్థాయిలో పెన్షన్ పంపిణీ
- వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు మరియు వివరాల సేకరణ
- వాలంటీర్ పట్ల వారి యొక్క క్లస్టర్ పరిధిలో ప్రజలు ఏమాత్రం సంతృప్తికరంగా ఉన్నారు
వీటితోపాటు బయోమెట్రిక్ హాజరు, సర్వే చేయు విధానం, ప్రజలకు ఏమాత్రం అందుబాటులో ఉన్నారు వంటివి కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
Studybizz Opinion Poll:
Leave a Reply