ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లకు ఉగాది పురస్కారాలను ప్రభుత్వం అందిస్తున్నది.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవ, వజ్ర, రత్న పేర్లతో అవార్డులను ఉగాది రోజున అందించడం జరుగుతున్నది.
ఈ ఏడాది ఉగాది రోజున జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాల చేత పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మే 5 న జరగాల్సిన వాలంటీర్ సన్మాన కార్యక్రమం మరోసారి వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తేనేటి వనిత ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని అకాల వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడటంతో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని కూడా వాయిదా వేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని మే 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు.
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న గ్రామ వార్డు వాలంటీర్ల జాబితా కింది లింక్ ద్వారా చెక్ చేయండి
Leave a Reply