ఫ్యామిలీ డాక్టర్ విధానం అంటే ఏమిటి?
గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయి లో “ఫ్యామిలీ డాక్టర్ విధానం” ప్రారంభించింది. సాధారణంగా ధనికులకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. అంటే నిత్యం తమ ఆరోగ్య సమస్యలకు తమ ఫ్యామిలీ డాక్టర్ నే కలుస్తారు. ఆ డాక్టర్ కి కూడా వీరి ఆరోగ్య స్థితి పై అవగాహన ఉంటుంది. ఇదే తరహా లో గ్రామాల్లో కూడా నిత్యం వైద్యులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందరికీ ఉచితంగా మరియు విస్తృతంగా సేవలు అందించాడమే ఈ పథకం లక్ష్యం.
పీహెచ్సీ లు, విలేజ్ క్లినిక్ లకు అనుసంధానంగా గ్రామాల్లో డాక్టర్లు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది ఉంటారు.
ఈ పీహెచ్సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించడం జరిగింది. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.
104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే గడిపి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు.
అవసరం అయిన వారికి ఇంటి వద్దే చికిత్స
డాక్టర్స్ నేరుగా గ్రామాల్లో పర్యటించే రోజుల్లో షెడ్యూల్ ఇలా..
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ 104 ఎంఎంయూ వద్ద ఓపీ సేవలు
మధ్యాహ్నం నుంచి మంచానికి పరిమితమైన వృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగుల గృహాల వద్ద సేవలు
అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు.
14 రకాల పరీక్షలు.. 105 రకాల మందులు తో విలేజ్ క్లినిక్ లకు అనుసంధానంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం.
‘ఫ్యామిలీ డాక్టర్’ ద్వారా ఉండే సేవలు
- – జనరల్ ఒపి ( ఔట్ పేషెంట్) సేవలు
- – బీపీ, షుగర్, ఊబకాయం(obesity) లాంటి జీవనశైలి జబ్బుల కేసుల చెక్ చేసి నిరంతరం పర్యవేక్షించడం.
- – గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తించి చికిత్స.చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాలు గుర్తించడం
- – రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు మరియు అవసరమైన మందులు , ఏమి తినాలో సూచించడం
- – ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం.
- నేలలో రెండు రోజులు విస్తృత స్థాయిలో గ్రామాల్లో 104 వాహనాల తో సందర్శించడం
- – పాలియేటివ్ కేర్.. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ వంటివి ఫ్యామిలీ డాక్టర్ విధానం లో ఉండే సేవలు
గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చిన 14 రకాల వైద్య పరీక్షలు
– గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్
– హిమోగ్లోబిన్ టెస్ట్
– ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్)
– మలేరియా టెస్ట్
– హెచ్ఐవీ నిర్ధారణ
– డెంగ్యూ టెస్ట్
– మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్)
– అయోడిన్ టెస్ట్
– వాటర్ టెస్టింగ్
– హెపటైటిస్ బి నిర్ధారణ
– ఫైలేరియాసిస్ టెస్ట్
– సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్
– విజువల్ ఇన్స్పెక్షన్
– స్పుటమ్ (ఏఎఫ్బీ)
Leave a Reply