విద్యా దీవెన పథకం సంబంధించి SC విద్యార్థుల కు ముఖ్యమైన అప్డేట్.. 2022-23 సంవత్సరానికి సంబంధించి ఈ నెల 19 న రాష్ట్ర ప్రభుత్వం విద్యా దీవెన అమౌంట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ సారి కొంతమంది SC విద్యార్థులకు పూర్తి అమౌంట్ జమ కాలేదు.
విద్యా దీవెన ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం లో భాగంగా 60% అమౌంట్ ను కేంద్ర ప్రభుత్వం post matric scholarship పేరుతో ప్రతి ఏటా జమ చేస్తుంది. ఇందులో 40% మాత్రమే రాష్ట్ర వాటా ఉంటుంది.
ఈసారి రాష్ట్ర వాట మాత్రమే జమ అయిందా?
ఈ ఏడాది కొంతమంది విద్యార్థులకు 40% రాష్ట్ర వాటా మాత్రమే జమ అయింది. మిగిలిన అమౌంట్ తల్లుల ఖాతా లో జమ కాలేదు. ఎందుకంటే ఈ ఏడాది నుంచి కేంద్ర వాటా నేరుగా విద్యార్థుల ఖాతా లో DBT పద్ధతిలో కేంద్రం జమ చేస్తుంది.
ఇప్పుడు ఏం చేయాలి?
స్టూడెంట్స్ తమ ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో అమౌంట్ పడిందో లేదో చెక్ చేయండి
కింది లింక్ లో మీరు చెక్ చేయవచ్చు.
అసలు బ్యాంక్ అకౌంట్ లేకపోతే బ్యాంక్ ఖాతా తెరిచి , ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి.
ఈ మేరకు కింది విధంగా ఇప్పటికే విద్యార్థులకు ఏపి ప్రభుత్వం మెసేజ్ లు పంపించడం జరిగింది.
విద్యా దీవెన పథకం పేమెంట్ స్టేటస్ ఎలా చూడాలి
కింది లింక్ లో ఇవ్వబడిన process ద్వారా పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
Leave a Reply