Jagananna Gorumudda: నేటి నుంచి పిల్లలకు రాగి జావ..ఏ రోజు ఏమి ఇస్తారో పూర్తి మెనూ చెక్ చేయండి

Jagananna Gorumudda: నేటి నుంచి పిల్లలకు రాగి జావ..ఏ రోజు ఏమి ఇస్తారో పూర్తి మెనూ చెక్ చేయండి

ఏపి లో మార్చ్ 21 నుంచి మధ్యాహ్న భోజన పథకం లో భాగంగా పిల్లలకు రాగిజావను వారానికి మూడు రోజుల పాటు అందించునున్న ప్రభుత్వం.

పిల్లల్లో పోషక విలువలను మరింత పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 37,63,698 మంది పిల్లలకు ఉదయం పూట రాగిజావను అందించనున్న ప్రభుత్వం. చిక్కి ఇవ్వని రోజుల్లో ఈ రాగిజావను ఇస్తారు. శ్రీ సత్య సాయి ట్రస్ట్ ఇందుకు కావాల్సిన రాగి పిండి మరియు బెల్లాన్ని పూర్తి ఉచితంగా ఇస్తుంది.

ఏ రోజుల్లో రాగిజావ ను అందిస్తారు

ఇప్పటికే వారానికి ఐదు రోజులు పిల్లలకు గుడ్డు ఇస్తున్నారు మరియు మూడు రోజులు బెల్లం,పల్లి తో చేసిన చిక్కి ఇస్తున్నారు. అయితే చిక్కి ఇవ్వని మిగిలిన మూడు రోజుల్లో రాగి జావను ఉదయం 8 గంటలకు పిల్లలకు ఇవ్వనున్నారు.

పిల్లల్లో ఐరన్ మరియు క్యాల్షియం అందించేందుకు వీలుగా మెను లో రాగి జావ ను చేర్చడం జరిగింది.

సవరించిన జగనన్న గోరుముద్ద పూర్తి మెనూ ఇదే

Monday హాట్ పొంగల్ , బాయిల్డ్ ఎగ్ ,వెజ్ పులావ్ , గుడ్డు కర్రీ, చిక్కి
Tuesday చింతపండు పులిహోర, దొండకాయ చట్నీ,ఉడికించిన గుడ్డు ,రాగి జావ
Wednesday వెజిటేబుల్ రైస్, బంగాళదుంప కుర్మా, గ్రుడ్డు, చిక్కి
Thursday సాంబార్ అన్నం, నిమ్మకాయ పులిహోర, టొమాటో చట్నీ,గుడ్డు, రాగి జావ
Friday అన్నం, ఆకు కూర, కోడిగుడ్డు, చిక్కి
Saturday అన్నం, సాంబార్, పాయసం లేదా స్వీట్ పొంగల్, రాగి జావ

రాగి జావ తయారీ విధానాన్ని కింద డౌన్లోడ్ చేసుకోండి

ఇది చదవండి: రాగి జావా తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

You cannot copy content of this page