Fever Survey 2023 : ఫీవర్ సర్వే 2023 పూర్తి చేయు విధానం

Fever Survey 2023 : ఫీవర్ సర్వే 2023 పూర్తి చేయు విధానం

దేశ వ్యాప్తంగా H3N2 వైరస్ వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేయడం జరిగింది. భారతదేశంలో H3N2 కారణంగా రెండు మరణాలు నమోదయ్యాయి. మొదటి మరణం కర్ణాటక రాష్ట్రం లో రెండవది హర్యానా లోనమోదైంది. గత మూడు నెలలుగా ఒక మోస్తరు వేగంతో వ్యాపిస్తున్న H3N2, ఇతర సబ్టైప్‌ల కంటే ఎక్కువ ఆసుపత్రులలో చేరిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఫీవర్ సర్వే చేయవలసిందిగా ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది.

ఆశా వర్కర్స్, వాలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టండి.జ్వర భాదితుల కోసం ప్రత్యేక ఓపీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశం. వారంలో ఐదు రోజులపాటు నాణ్యత ప్రమాణాలతో ఫీవర్ సర్వే నిర్వహించాల్సి ఉందిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు ఆశా వర్కర్లు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవాలి ఎవరికైనా జ్వరంగా ఉంటే సంబంధిత ఏనంతో పాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకు వెళ్ళవలసి ఉంటుంది. వారు H3N2 అవునా కాదా అని నిర్దారణకు సంబందించిన పరీక్షలు చేపించి సంబందించిన సూచనలు ఇస్తారు. ఉచిత మందులకి ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో సహాయం అందిస్తారు.

ఈ సర్వే ను GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లో చేయాలి. ఎప్పటికి అప్పుడు అప్డేట్ అయ్యే మొబైల్ అప్లికేషన్ కింద లింక్ ద్వారా Download చేసుకోవాలి.

Step 1 : మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తరువాత వాలంటీర్ ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.

Step 2 : లాగిన్ అయిన తరువాత Services Delivery ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత Covid-19 Survey (2022) / కోవిడ్ – 19 సర్వే (2022) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3 Screening Pending మరియు Screening Completed అనే రెండు ఆప్షన్ లు ఉంటాయి. అందులో Screening Pending లో ఉన్నవి అన్ని కూడా సర్వే ఇంకా పెండింగ్ ఉన్నవి అని అర్థము మరియు Screening Completed అన్ని కూడా సర్వే పూర్తి అయినవి అని అర్థము. సర్వే మొదలు చేయుటకు Screening Pending పై క్లిక్ చేయాలి.

Step 4 : క్లస్టర్ లో ఉన్నా కుటుంబాల పేర్లు అన్ని కూడా వరుసలో వస్తాయి. పేరు తో సెర్చ్ చేయిటకు Search With Name ఆప్షన్ ను ఉపయోగించుకోవాలి.పేరు పై క్లిక్ చేసాక, “మీ ఇంట్లో ఎవరికి అయిన అనారోగ్యం ఉందా ?” అనే ప్రశ్నకు అనారోగ్యం ఉంటే “ఉంది” అని లేకపోతే “లేదు” అని సెలెక్ట్ చేయాలి.

Step 5 : “కుటుంబ సభ్యుల వివరాలు” చూపిస్తాయి . అందులో కుటుంబం లో ఉన్నా అందరి పేర్లు చూపిస్తాయి. ఎవరికి అయిన సమస్య ఉంటే వారికి “అనారోగ్యం ఉన్నవారు” ను సెలెక్ట్ చేయాలి. అప్పుడు సమస్యల లిస్ట్ చుపిస్తుంది.అందులో వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయో సెలెక్ట్ చేయాలి.

  • జ్వరం
  • పొడి దగ్గు 
  • నొప్పులు మరియు భాదలు
  • అలసట
  • గొంతు మంట
  • అతి సారం
  • కండ్ల కలక
  • చాతి నొప్పి మరియు ఒత్తిడి
  • రుచి లేదా వాసన కోల్పోవడం
  • చర్మం పై దురద
  • తలనొప్పి
  • కాలు వేళ్ళు రంగు మార్పు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • కదలిక కోల్పోవటం
  • పై వాటిని సెలెక్ట్ చేయాలి.

స్మార్ట్ ఫోన్ ఉన్నవారు – స్మార్ట్ మొబైల్ ఫోన్ వాడినట్లు అయితే టిక్ చేయాలి.

ఈ-సంజీవని అప్లికేషన్ డౌన్లోడ్ చేసినవారు – ఎవరి స్మార్ట్ మొబైల్ లో eSanjeevani అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తే అప్పుడు టిక్ చేయాలి.

ఈ-సంజీవని అప్లికేషన్ వాడినవారు – ఈసంజీవని మొబైల్ అప్లికేషన్ తరుచుగా వాడుతుంటే అప్పుడు టిక్ చేయాలి.

టీకా తీసుకున్నారా – కోవిడ్ వాక్సిన్ తీసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

1వ టీకా తీసుకున్నారా – మొదటి డోస్ వాక్సిన్ వేసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

2వ టీకా తీసుకున్నారా – రెండవ డోస్ వాక్సిన్ వేసుకుంటే టిక్ చేయాలి. లేదంటే వదిలి వేయాలి.

టీకా తీసుకున్న తేదీ – 1వ లేదా 2వ టీకా తీసుకున్న తేదీ గుర్తు ఉంటే ఆ తేదీ వేయాలి.

Step 6 : పై వివరాలు అందరికి ఎంటర్ చేసిన తరువాత Mobile లో సర్వే చేసిన అంత సేపు లొకేషన్ ఆన్ లోనే ఉంచుకోవాలి. Capture Latlng పై క్లిక్ చేస్తే లొకేషన్ తీసుకుంటుంది. తరువాత SUBMIT పై క్లిక్ చేయాలి.ఈ విధంగా క్లస్టర్ లో ఉన్న వారందరికి సర్వే పూర్తి చేయాలి.

H3N2 అంటే ఏమిటి?

H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ మానవులలో వ్యాధిని కలిగించే అనేక రకాల ఇన్ఫ్లుఎంజా వైరస్లలో ఒకటి. H3N2 అనేది వైరల్ జాతి ఇన్ఫ్లుఎంజావైరస్ A యొక్క ఉప రకం, ఇది మానవ ఇన్ఫ్లుఎంజాకు ముఖ్యమైన కారణం. దీని పేరు దాని కోటు ఉపరితలంపై ఉండే రెండు రకాల ప్రొటీన్ల రూపాల నుండి వచ్చింది, హేమాగ్గ్లుటినిన్ (H) మరియు న్యూరామినిడేస్ (N).దీని మూలాలు, భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 90 H3N2 ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదయ్యాయి. H3N2 కాకుండా, దేశంలో ఎనిమిది H1N1 ఇన్ఫ్లుఎంజా కేసులు కూడా నమోదయ్యాయి.

H3N2 యొక్క లక్షణాలు

H3N2 యొక్క ఫ్లూ లక్షణాలు ఇతర కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా వైరస్లతో పోల్చవచ్చు. ఇవి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలను పోలి ఉన్నప్పటికీ, ఈ లక్షణాలను ఎప్పటికీ విస్మరించకూడదు.

  • శరీర నొప్పి
  • చలి, జ్వరం
  • అలసట
  • అతిసారం
  • వాంతులు
  • దగ్గు
  • ముక్కు కారడం లేదా మూసుకుపోవడం
  • గొంతు నొప్పి
  • తలనొప్పి

ఎలా గుర్తించాలి?

సాధారణ జలుబు వంటి ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే, ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఫ్లూ కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. ఎవరికైనా H3N2 ఉందో లేదో వారి శారీరక లక్షణాలను చూసి గుర్తించడం కష్టంగా ఉండటానికి ఇది ఒక కారణం. వైద్య నిపుణుడిచే నిర్వహించబడే ప్రయోగశాల పరీక్ష మాత్రమే మీరు H3N2 లేదా మరొక అనారోగ్యంతో సంక్రమించాలా అని నిర్ధారించగలదు.

H3N2 ఫ్లూ ఎంతకాలం ఉంటుంది?

హెచ్‌3ఎన్‌2 వైరస్‌ సోకిన వ్యక్తుల్లో జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయని, మూడు, నాలుగు రోజుల్లో కోలుకుంటారని వైద్యనిపుణులు అంటున్నారు.

H3N2 వైరస్ కు కారణం?

ఒక వ్యక్తికి H3N2 ఇన్‌ఫ్లుఎంజా సోకినప్పుడు, వైరస్ శ్వాసనాళంలోకి చొరబడి శ్వాసనాళాల వాపును కలిగిస్తుంది, ఇది జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారటం లేదా మూసుకుపోవడం, శరీర నొప్పులు, తలనొప్పి మరియు అలసట వంటి లక్షణాలకు దారి తీస్తుంది.

కాలానుగుణ మార్పు

వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు ఛాతీ రద్దీని నివేదించే రోగుల పెరుగుదలకు రుజువుగా, కాలానుగుణ మార్పు ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కాలుష్యం కారణంగా వైరల్ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

H3N2 వైరస్ సంక్రమణను ఎలా నివారించాలి?

H3N2 ఇన్ఫ్లుఎంజాను నివారించడానికి, వార్షిక ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం, సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా మీ చేతులను కడగడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సంబంధాన్ని నివారించడం, మీరు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు మీ నోరు మరియు ముక్కును కప్పి ఉంచడం మరియు మీకు లక్షణాలు ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ మాస్క్ ధరించడం అదనపు రక్షణను అందిస్తుంది.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page