పాన్ ఆధార్ లింక్ చేశారా ? ఒకవేళ ఇప్పటికి పాన్ ఆధార్ లింక్ చేయకపోతే ఇదే మీకు చివరి అవకాశం.
ఇప్పటికే పాన్ ఆధార్ ఉచితంగా అనుసంధానం చేసుకోడానికి కేంద్రం గతంలో గడువు కల్పించింది, ఉచితంగా లింక్ చేసుకునే గడువు ముగిసినప్పటికీ , ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్నవారు ఉంటె వారికి 1000 రూపాయల జరిమానా తో మార్చ్ 31 వరకు చివరి అవకాశం కల్పించింది.
పాన్ ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది ?
మార్చ్ 31 తర్వాత మీ పాన్ కార్డ్ పని చేయడం ఆగిపోతుంది, PAN హోల్డర్‌లు వారి పది అంకెల పాన్ నంబర్ ను ఇక ఉపయోగించలేరు. అంతే కాదు మీ PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు నిలిపివేయబడతాయి. వీటితో పాటు ఆదాయపు పన్ను పెండింగ్‌లో ఉన్న రిటర్న్స్ యొక్క ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడుతుంది.
అసలు పాన్ ఆధార్ లింక్ అయిందా లేదా ఎలా చూడాలి ?
కింది లింక్ లోకి వెళ్లి మీ Pan – Aadhar లింకింగ్ స్టేటస్ ను సులభంగా తెలుసుకోవచ్చు.
పాన్ ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలి ?
కింది లింక్ ద్వారా చాలా సులభంగా మీ పాన్ ను ఆధార్ కి లింక్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం ₹1000 పెనాల్టీ చెల్లించి మాత్రమే మీరు లింక్ చేసుకోగలరు
పాన్ కి ఆధార్ లింక్ చేసుకునే పూర్తి ప్రాసెస్ కింది వీడియో లో చూడగలరు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Studybizz ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.
Leave a Reply