ఆంధ్రప్రదేశ్ లో మార్చ్ 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయ్యి, నామినేషన్స్ స్వీకరించడం కూడా పూర్తి అయింది .
ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల జరిగే మార్చి 13వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి CEO ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లా మినహాయించి అన్ని జిల్లాలకు సెలవు దినం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
రాష్ట్రంలో అన్ని పాఠశాలలు, ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు దుకాణాలకు ఈ సెలవు దినం వర్తిస్తుంది.
Leave a Reply