Indiramma Kutumba Jeevitha Bhima Scheme |ఇందిరమ్మ కుటుంబ జీవిత  భీమా పథకం 2026 – కుటుంబానికి 5 లక్షల భరోసా | పూర్తి వివరాలు

Indiramma Kutumba Jeevitha Bhima Scheme |ఇందిరమ్మ కుటుంబ జీవిత  భీమా పథకం 2026 – కుటుంబానికి 5 లక్షల భరోసా | పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత మరియు భరోసా కల్పించేందుకు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Kutumba Jeevitha Bhima Scheme) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని జూన్ 26 నుంచి అమల్లోకి తీసుకొస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న రైతు బీమా పథకం లాగానే ఇందిరమ్మ కుటుంబం కూడా అమలు చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Table of Contents

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Kutumba Jeevitha Bhima Scheme) Overview

అంశంవివరాలు
పథకం పేరుఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం 2026
రాష్ట్రంతెలంగాణ
ప్రారంభ తేదీజూన్ 2, 2026
బీమా మొత్తంరూ.5 లక్షలు
వర్తించే సందర్భాలుప్రమాదవశాత్తు మరణం, అనారోగ్యంతో మరణం
లబ్ధిదారులుకుటుంబ పెద్ద మరణించిన కుటుంబం
అర్హత ఆధారంసీపెక్ (CPEC) సర్వే డేటా
కవరేజ్1.15 కోట్ల కుటుంబాలు
జనాభా డేటా3.54 కోట్ల మంది
బడ్జెట్రూ.4,000 కోట్లు
ప్రీమియం చెల్లింపుప్రభుత్వమే చెల్లిస్తుంది
అమలు మోడల్రైతు బీమా తరహాలో

ఎవరికి Indiramma Kutumba Jeevitha Bhima Scheme పథకం వర్తిస్తుంది?

ప్రమాదవశాత్తు లేదా  దురదృష్టవశాత్తు లేదా అనారోగ్యాల కారణంగా కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థికంగా భరోసా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

బడ్జెట్ కేటాయింపులు

ఈ పథకం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో 4వేల కోట్ల రూపాయలను కేటాయించింది. దీని ద్వారా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబ యజమానులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత పథకం అమలు కానుంది.

Indiramma Kutumba Jeevitha Bhima Scheme అర్హతలు

ఈ పథకం CPEC సర్వే ఆధారంగా అమలు చేయనున్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఎందుకు సంబంధించిన పూర్తి విధి విధానాలు మరియు అర్హత ప్రమాణాలు ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు.

రైతు బీమా పథకం మరియు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం మధ్య వ్యత్యాసం ఏమిటి?

అంశంరైతు బీమాఇందిరమ్మ బీమా
లబ్ధిదారులురైతులుఅన్ని అర్హ కుటుంబాలు
బీమా మొత్తంరూ.5 లక్షలురూ.5 లక్షలు
ప్రీమియంప్రభుత్వంప్రభుత్వం
అమలు విధానంప్రస్తుతంలో అమలుకొత్తగా అమలు

ముఖ్యమైన లింకులు – Important Links

సేవలింక్
తెలంగాణ ప్రభుత్వం అధికారిక పోర్టల్https://www.telangana.gov.in
MeeSeva పోర్టల్https://www.meeseva.telangana.gov.in
ప్రభుత్వ పథకాల సమాచారంhttps://www.telangana.gov.in/government-schemes
అప్లికేషన్ లింక్ (Expected)Expected Soon
బెనిఫిషియరీ స్టేటస్ చెక్Expected Soon
గైడ్‌లైన్స్ PDFExpected Soon
CPEC సర్వే వివరాలుExpected Soon

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Indiramma Kutumba Jeevitha Bhima Scheme) – FAQs

1) ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అంటే ఏమిటి?

ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకం. కుటుంబ పెద్ద మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.


2) ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ పథకం జూన్ 2, 2026 నుంచి అమల్లోకి రానుంది.


3) ఎంత మొత్తంలో బీమా సాయం లభిస్తుంది?

అర్హత కలిగిన కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లిస్తారు.


4) ఎలాంటి మరణాలకు ఈ పథకం వర్తిస్తుంది?

  • ప్రమాదవశాత్తు మరణం
  • అనారోగ్య కారణాల వల్ల మరణం

5) ఈ పథకానికి ఎవరు అర్హులు?

సీపెక్ (CPEC) సర్వేలో నమోదైన కుటుంబాలు మాత్రమే అర్హులు.


6) సీపెక్ సర్వే అంటే ఏమిటి?

ఇది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల అంశాలపై ప్రభుత్వం నిర్వహించిన సర్వే. ఈ డేటా ఆధారంగా పథకాల అర్హత నిర్ణయిస్తారు.


7) ప్రీమియం ఎవరు చెల్లించాలి?

ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. లబ్ధిదారులు చెల్లించాల్సిన అవసరం లేదు.


8) ఈ పథకం రైతు బీమా లాంటిదేనా?

అవును, ఇది రైతు బీమా పథకం తరహాలోనే అమలు చేయబడుతుంది. కానీ ఇది అన్ని అర్హ కుటుంబాలకు వర్తిస్తుంది.


9) రేషన్ కార్డు ఆధారంగా అర్హత నిర్ణయిస్తారా?

ప్రస్తుతం ఇది స్పష్టంగా తెలియలేదు.
👉 మహిళ పేరుతో కార్డు ఉంటే ఆమెకే వర్తిస్తుందా? లేక కుటుంబ పెద్దకు వర్తిస్తుందా? అన్నది గైడ్‌లైన్స్‌లో క్లియర్ అవుతుంది.


10) ఈ పథకం కోసం ఎలా అప్లై చేయాలి?

ప్రస్తుతం అప్లికేషన్ ప్రక్రియపై వివరాలు లేవు.
👉 ప్రభుత్వం త్వరలో అప్లికేషన్ విధానం మరియు మార్గదర్శకాలు విడుదల చేయనుంది.


11) ఎన్ని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది?

సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది.


12) ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి?

కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత మరియు భరోసా కల్పించడం.

You cannot copy content of this page