ఏపీలో కాలేజ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరం లో చదువుకున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీలో ఫీజు ప్రియంబర్స్మెంట్ కింద 1200 కోట్లు విడుదల
2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో ముఖ్యంగా BC, EWS, మైనారిటీ విద్యార్థులకు సంబంధించి బకాయిలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ జీవోలను విడుదల చేసింది.
- బీసీలకు – 477 కోట్లు + అదనంగా 258.23 కోట్లు
- EWS కోట విద్యార్థులకు – 365 కోట్లు
- మైనార్టీ విద్యార్థులకు – 98.92 కోట్లు
ఎటువంటి కీలక ప్రకటనలు ఆర్భాటాలు లేకుండా విద్యార్థుల బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Post matric scholarship (RTF or fees reimbursement ) amount released by the government of Andhra Pradesh on 10.02.2026. This amount pertains to the fee reimbursement for the previous academic year.

Join us on WhatsApp for regular updates



