PMEGP Scheme 2025: రూ.50 లక్షల వరకు రుణం, 35% వరకు సబ్సిడీ — నిరుద్యోగులకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశం

PMEGP Scheme 2025: రూ.50 లక్షల వరకు రుణం, 35% వరకు సబ్సిడీ — నిరుద్యోగులకు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశం

PMEGP Scheme 2025: దేశంలోని నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధిని సంపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత శక్తివంతమైన పథకం Prime Minister’s Employment Generation Programme (PMEGP). ఈ పథకం కింద కొత్తగా సూక్ష్మ, చిన్న, తయారీ మరియు సేవా యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి ₹1 లక్ష నుండి ₹50 లక్షల వరకు రుణం లభిస్తుంది.

ఈ రుణంపై 25–35% వరకు Margin Money Subsidy అందించడం PMEGP ప్రత్యేకత.


Table of Contents

PMEGP Scheme 2025 పథకం ముఖ్య లక్ష్యాలు (Core Objectives)

PMEGP యొక్క ప్రధాన లక్ష్యాలు:

  • నిరుద్యోగ యువతకు ఉద్యోగం కాకుండా ఉద్యోగదాతలుగా చేసే అవకాశం
  • గ్రామీణ & పట్టణ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు
  • చేతివృత్తుల వారిని మళ్లీ నిలబెట్టడం
  • వలసలను తగ్గించడం
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
  • మహిళా సాధికారత, సామాజిక–ఆర్థిక పురోగతి
  • కొత్త ఉత్పత్తులు, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం

ఈ కారణాల వల్ల PMEGP స్కీమ్‌ను భారతదేశంలో అతిపెద్ద స్వయం ఉపాధి పథకంగా పరిగణిస్తారు.


PMEGP Scheme 2025 పథకం కింద రుణ పరిమితులు (Loan Limits)

యూనిట్ రకంగరిష్ట రుణం
Manufacturing Unit₹50,00,000
Service Unit₹20,00,000
Micro/Self-Employment₹1,00,000–₹3,00,000

2023-24లో రుణ పరిమితిని 25 లక్షల నుండి 50 లక్షలకు పెంచారు.


PMEGP Margin Money Subsidy వివరాలు (Category-Wise Subsidy Structure)

వర్గంగ్రామీణ ప్రాంతంపట్టణ ప్రాంతం
SC/ST/OBC/Women/PH/Minorities/Ex-Servicemen/Transgenders35% Subsidy25% Subsidy
General Category25% Subsidy15% Subsidy

PMEGP Scheme 2025 Beneficiary Contribution (బాధ్యత వహించాల్సిన పెట్టుబడి)

వర్గంసొంత పెట్టుబడి
General Category10%
SC/ST/OBC/Women/PH/Minorities5%

PMEGP Scheme 2025 Important Links

శీర్షికలింక్
PMEGP Online Application Portalhttps://kviconline.gov.in/pmegpeportal/
PMEGP Application Status / e-Trackinghttps://kviconline.gov.in/pmegpapp/
KVIC Official Websitehttps://kvic.gov.in/
PMEGP Guidelines (Official PDF)https://www.kviconline.gov.in/pmegpeportal/dashboard/notification/PMEGP_Guidelines_Certified_2022_3.pdf
PMEGP Model Project Profiles (200+ DPRs)https://kviconline.gov.in/pmegp/pmegp_project_profiles.jsp
MSME Ministry – Govt. of Indiahttps://msme.gov.in/
Udyam Registration (MSME Registration)https://udyamregistration.gov.in/
PMEGP Helpdesk / Support Centerhttps://kviconline.gov.in/pmegphelpdesk/
KVIC State Offices Listhttps://kvic.gov.in/kvicres/kvic_state_offices
District Industries Centers (DIC) Directoryhttps://dcmsme.gov.in/dic-directory
EDP Training (Entrepreneur Training)https://www.niesbud.nic.in/
Official PMEGP Scheme Pagehttps://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegpscheme.jsp
PMEGP Project List PDF (Custom – Telugu)Download PMEGP Project List PDF

PMEGP Loan Example (సబ్సిడీ ఎలా లెక్కిస్తారు?)

ఉదాహరణ 1:

మహిళ గ్రామీణ ప్రాంతంలో ₹10 లక్షల ప్రాజెక్టు వేస్తే:

  • సొంత పెట్టుబడి → 5% = ₹50,000
  • బ్యాంకు రుణం → ₹9,50,000
  • Subsidy → 35% of 10,00,000 = ₹3,50,000

అంటే చివరకు ఆమె తిరిగి చెల్లించాల్సిన రుణం:
₹6,00,000 మాత్రమే

ఉదాహరణ 2:

General Category person Urban area లో ₹20 లక్షల ప్రాజెక్టు:

  • Beneficiary Contribution: 10% = ₹2,00,000
  • Subsidy: 15% = ₹3,00,000

తిరిగి చెల్లించాల్సిన రుణం:
₹15,00,000 మాత్రమే


PMEGP కింద ఏర్పరిచే యూనిట్ల రకాలు (Approved Units List)

PMEGP కింద 500+ చిన్న, పెద్ద తయారీ & సేవా ప్రాజెక్టులు అర్హత పొందుతాయి.

Manufacturing Projects

  • పచ్చళ్లు, కారం, పిండుల తయారీ
  • బేకరీ, నూడిల్స్, చాక్లెట్ యూనిట్లు
  • పీనట్ చక్కెర కోటింగ్ యూనిట్
  • ప్యాకేజింగ్ యూనిట్లు
  • ఫర్నిచర్ తయారీ
  • బూట్లు తయారీ
  • మట్టి బొమ్మలు, శిల్పాలు
  • కాగితం ప్లేట్లు, కప్పులు
  • హ్యాండ్‌మేడ్ సోప్స్
  • క్లీనింగ్ ప్రోడక్ట్స్ (ఫినాయిల్, హార్పిక్ టైప్)
  • అగరబత్తి తయారీ యూనిట్
  • ధాన్య శుద్ధి యూనిట్
  • ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్ (గానుగ నూనె)

Service Projects

  • టెంట్ హౌస్
  • DJ సౌండ్ సిస్టమ్
  • కారు ట్రావెల్స్
  • ఫోటోగ్రఫీ / వీడియోగ్రఫీ స్టూడియో
  • మొబైల్ సర్వీస్ సెంటర్
  • బ్యూటీ పార్లర్
  • సెంట్రింగ్ వర్క్
  • ప్రింటింగ్ & జిరాక్స్ సెంటర్
  • సాఫ్ట్‌వేర్ సర్వీసెస్
  • డిజిటల్ సేవలు (MeeSeva/CSC వంటివి అర్హం కాదు)

PMEGP Negative List (రుణం రాని వ్యాపారాలు)

KVIC స్పష్టంగా నిషేధించిన వ్యాపారాలు:

  • గుట్కా, సిగరెట్, పొగాకు ఉత్పత్తులు
  • మాంసం సంబంధిత వ్యాపారాలు
  • మద్యం ఉత్పత్తులు
  • హోటల్/రెస్టారెంట్ (కొన్ని రాష్ట్రాల్లో అనుమతి లేదు)
  • విద్యాసంస్థ, వైద్య కేంద్రం
  • నీటి ప్యాకేజింగ్ ప్లాంట్ (కొన్ని రాష్ట్రాల్లో నిబంధనలు ఉన్నవి)
  • పారిశ్రామిక రసాయనాలు
  • CSC / MeeSeva/ ఫ్రాంచైజీలు
  • ఎక్సిస్టింగ్ యూనిట్లు, రీనోవేషన్, ఎక్స్పాంశన్ ప్రాజెక్టులు

PMEGP Scheme 2025 Eligibility (అర్హతలు)

  • వయస్సు: కనీసం 18 సంవత్సరాలు
  • విద్యార్హత: 8th class pass (₹10 లక్షల పైబడిన ప్రాజెక్టులకు తప్పనిసరి)
  • SHG సభ్యులు అర్హులు (బిపిఎల్ అయితే మరింత మంచిది)
  • కుటుంబంలో ఒకరే దరఖాస్తు చేయాలి
  • కొత్త యూనిట్ మాత్రమే
  • ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందకపోవాలి

PMEGP Scheme 2025 Required Documents (అవసరమైన పత్రాలు)

  • Aadhaar Card
  • PAN Card
  • Address Proof
  • Educational Certificates
  • Caste Certificate (if applicable)
  • EDP Training Certificate
  • Passport Size Photos
  • DPR (Detailed Project Report)
  • Bank Passbook
  • Self Declaration Form
  • SHG Certificate (if applicable)

Detailed Project Report (DPR) లో ఉండాల్సినవి

  • Project title
  • Product summary
  • Market analysis
  • Machinery details, quotations
  • Raw material details
  • Cost of production
  • Working capital
  • Profitability projection (5 years)
  • Cash flow analysis

KDIC, DIC & banks దీనిని అత్యంత ముఖ్యంగా పరిశీలిస్తాయి.


PMEGP Training (EDP Training)

  • 1 నెలపాటు Entrepreneur Development Programme (EDP)
  • KVIC/KVIB/DIC ద్వారా అందిస్తారు
  • ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుంటాయి
  • శిక్షణ తప్పనిసరి
  • Training complete చేసిన తర్వాతే subsidy release అవుతుంది

PMEGP Scheme 2025 Application Process (Step-by-Step)

Step 1: పోర్టల్‌లో రిజిస్ట్రేషన్

Step 2: యూజర్ ID, పాస్‌వర్డ్ సృష్టించడం

Step 3: Online Application భర్తీ చేయడం. వ్యక్తిగత వివరాలు, ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయాలి.

Step 4: DPR, డాక్యుమెంట్లు అప్‌లోడ్

Step 5: గ్రామీణ – KVIC / పట్టణ – DIC పరిశీలన

Step 6: Interview / Verification

Step 7: Bank Sanction

Step 8: EDP Training

Step 9: Unit Setup & Loan Disbursal

Step 10: Subsidy Release (Margin Money)


PMEGP Scheme 2025 Processing Timeline (Time Required)

దశసమయం
Online Applyవెంటనే
Verification10–15 రోజులు
Interview / Approval15–30 రోజులు
Bank Sanction15–30 రోజులు
EDP Training1 నెల
Subsidy Release3–6 నెలలు

మొత్తం ప్రాసెస్: 3–6 నెలలు


Also Read:

PMEGP Contact Details


Frequently Asked Questions (FAQ)

PMEGP పథకం కింద రుణం ఎవరికోసం?

నిరుద్యోగ యువత, మహిళలు, SHG సభ్యులు, చిన్న పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి.

PMEGP రుణం వస్తే సబ్సిడీ వెంటనే వస్తుందా?

కాదు. యూనిట్ ఏర్పాటు చేసి అవసరమైన రికార్డులు సమర్పించిన తర్వాత మాత్రమే subsidy release అవుతుంది.

EDP Training లేకుండా రుణం వస్తుందా?

లేదు. Training తప్పనిసరి.

PMEGP రుణం తీసుకున్న తర్వాత యూనిట్ మార్చవచ్చా?

కాదు. మార్పులు చేయాలంటే అధికారిక అనుమతి అవసరం.

You cannot copy content of this page