ఆధార్ అప్డేట్ కి సంబంధించి కేంద్ర ఆధార్ ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల సమయంలో మరియు 15 సంవత్సరాలు సమయంలో మాత్రమే బయోమెట్రిక్ అప్డేట్ సేవలు ఉచితంగా అందిస్తున్న ఆధార్, ఇకనుంచి 5 నుంచి 17 సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా చేసుకునే బయోమెట్రిక్ అప్డేట్ కి కూడా ఎటువంటి ఫీజు వసూలు చేయదు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న రూల్ ఏంటి? ఎంత ఫీసు వసూలు చేస్తున్నారు?
ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారం, పిల్లలకి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు వారి ఆధార్‌లో వేలిముద్రలు, ఐరిస్ మరియు ఫోటోను తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. దీనిని మొదటి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) అంటారు.
5 మరియు 7 సంవత్సరాల మధ్య పిల్లవాడు MBU చేస్తే, అది ఉచితం. కానీ ఏడు సంవత్సరాల వయస్సు దాటితే, రూ. 100 రుసుము వసూలు చేస్తారు. మొదటి మరియు రెండవ బయోమెట్రిక్ (MBUS), వరుసగా 5-7 మరియు 15-17 సంవత్సరాల మధ్య పూర్తి చేసే బయోమెట్రిక్ అప్డేట్ పూర్తిగా ఉచితం.
తాజా నిర్ణయంతో, ఐదు నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఇప్పుడు బయోమెట్రిక్ ఉచితంగా అప్డేట్ చేస్తారు. అయితే ఉచితం కదా అని ఎక్కువ ఆలస్యం చేస్తే మీ ఆధార్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల బయోమెట్రిక్ డేటా ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను నిర్ధారించడానికి బయోమెట్రిక్ ని సకాలంలో పూర్తి చేయడం తప్పనిసరి.
ఏడు సంవత్సరాల వయస్సు తర్వాత కూడా MBU పూర్తి కాకపోతే, ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆధార్ నంబర్‌ను తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల లోపు మరియు 15 నుంచి 17 సంవత్సరాల లోపు తప్పనిసరిగా రెండుసార్లు బయోమెట్రిక్ పూర్తి చేసుకోగలరు.
Also Read
- మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ తెలుసుకునే పూర్తి విధానం – How To Know Aadhar Linked Mobile Number
- Pan Aadhar Link – ఆధార్ పాన్ లింకింగ్ కి జూన్ 30 లాస్ట్ డేట్.. పెండింగ్ ఉన్నవారు ఈ విధంగా ఆన్లైన్ లో లింక్ చేసుకోండి
- Aadhar Document Update Extended : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. డాక్యుమెంట్ అప్డేట్ గడువు పెంపు
ఆన్లైన్ లో అయితే పూర్తి ఉచితంగా మీరే డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు. కింది ప్రాసెస్ చూడండి
ఆధార్ వివరాల్లో తప్పులా? ఇలా ఉచితంగా మార్చుకోవచ్చు
ఆధార్ కార్డు మనకి ప్రధాన గుర్తింపు పత్రం. ఇందులోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, జెండర్, ఫోటో వంటి వివరాల్లో తప్పులు ఉంటే, UIDAI (Unique Identification Authority of India) వాటిని సరిచేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ముఖ్యంగా myAadhaar పోర్టల్‌లో 2026 జూన్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకోవచ్చు. ఆధార్ నమోదు కేంద్రాల్లో మాత్రం నామమాత్రపు ఛార్జీలు ఉంటాయి.
ఆధార్ వివరాలను ఎన్ని సార్లు మార్చుకోవచ్చు?
- పేరు → 2 సార్లు మాత్రమే
- పుట్టిన తేదీ (DOB) → 1సారి (మొదట ఇచ్చిన తేదీకి 3 సంవత్సరాల లోపులోనే)
- జెండర్ → 1సారి మాత్రమే
- ఫోటో → ఎన్ని సార్లయినా (కేంద్రంలో మాత్రమే)
- చిరునామా → పరిమితి లేదు
ఆధార్ అప్డేట్ చేయడానికి రెండు మార్గాలు
1. ఆన్లైన్‌లో (myAadhaar Portal ద్వారా)
- myAadhaar పోర్టల్ ఓపెన్ చేయండి.
- ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, OTP తో లాగిన్ అవ్వండి.
- Update Address ఆప్షన్ క్లిక్ చేయండి.
- కొత్త చిరునామా ఎంటర్ చేసి, సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి.
- పేమెంట్ చేసిన తర్వాత (₹50 వరకు) మీకు URN నంబర్ వస్తుంది.
- దాని ద్వారా ఆధార్ అప్డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
2. ఆధార్ నమోదు కేంద్రం ద్వారా
- దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళండి.
- అప్డేట్/కరెక్షన్ ఫారమ్ నింపండి.
- సంబంధిత డాక్యుమెంట్స్ సమర్పించండి.
- రశీదు ద్వారా అప్డేట్ స్టేటస్ ట్రాక్ చేయండి.
పరిమితి దాటిన తర్వాత మార్పులు కావాలంటే?
మీరు పేరు, DOB, జెండర్ వివరాలను UIDAI పరిమితి దాటిన తర్వాత మార్చుకోవాలనుకుంటే:
- ఆధార్ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళాలి.
- లేదా మెయిల్/పోస్ట్ ద్వారా విజ్ఞప్తి పంపాలి.
- ఆధార్ నంబర్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్, URN స్లిప్‌తో పాటు help@uidai.gov.in కి పంపాలి.
- UIDAI సమంజసమని భావిస్తే మార్పులు ఆమోదిస్తుంది.
ఆధార్ కేంద్రాలను ఎలా కనుగొనాలి?
- Bhuvan Aadhaar Portal లోకి వెళ్లండి.
- “Centers Nearby” ఆప్షన్ క్లిక్ చేయండి.
- PIN కోడ్ ఎంటర్ చేస్తే మీ దగ్గరలోని ఆధార్ కేంద్రాలు మ్యాప్‌లో కనిపిస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
Q1: ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది?
myAadhaar పోర్టల్‌లో 2026 జూన్ 14 వరకు ఉచితం. కేంద్రాల్లో మాత్రం ₹50 వరకు ఛార్జ్ ఉంటుంది.
Q2: ఫోటోని ఆన్లైన్‌లో మార్చుకోవచ్చా?
కాదు. ఫోటో మార్పు కేవలం ఆధార్ నమోదు కేంద్రంలోనే చేయాలి.
Q3: పుట్టిన తేదీ ఎన్ని సార్లు మార్చుకోవచ్చు?
ఒకసారి మాత్రమే. మొదట ఇచ్చిన తేదీకి 3 సంవత్సరాల లోపులో మార్పు చేయాలి.
Q4: చిరునామా ఎన్ని సార్లయినా మార్చుకోవచ్చా?
అవును. చిరునామా మార్పు సంఖ్యకు పరిమితి లేదు.
ముగింపు
ఆధార్‌లోని తప్పులను సరిచేయడం చాలా సులభం. UIDAI అధికారిక పోర్టల్ లేదా దగ్గరలోని ఆధార్ కేంద్రం ద్వారా మీరు మీ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల
Leave a Reply