అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి

రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 2 న విడుదల చేసిన విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో 99.98% మందికి అన్నదాత సుఖీభవ నగదు జమ అయినట్టు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు.

అన్నదాత సుఖీభవ అమౌంట్ పడలేదా ఇవి చెక్ చేయండి

అన్నదాత సుఖీభవ అమౌంట్ పడకపోవడానికి పలు కారణాలను వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.[Annadata Sukhibhava not credited reasons] కారణాలు ఈ విధంగా ఉన్నాయి.

  • ఈ కేవైసీ చేయకపోవడం
  • NPCI యాక్టివ్ గా లేకపోవడం లేదా మ్యాపింగ్ లేకపోవడం
  • వెరిఫికేషన్ టైం లో ఏదైనా పరిశీలన ఉండి కొంతమందిని తిరస్కరించడం

ఈ కేవైసీ దాదాపు అందరికీ ప్రభుత్వం మ్యాపింగ్ చేయక కొంతమందికి మాత్రం ఈ కేవైసీ పెండింగ్ ఉందని గతంలోనే ప్రభుత్వం వెల్లడించింది. అటువంటివారు వెంటనే రైతు సేవ కేంద్రానికి వెళ్లి ఈ కేవైసీ నమోదు చేసుకోవలసి ఉంటుంది.

ఇక ఎన్పీసీఐ ఆక్టివ్ గా ఉందా లేదా అసలు మ్యాప్ అయిందా లేదా అనే విషయాన్ని బ్యాంకు కి వెళ్లి నిర్ధారించుకోవచ్చు. NPCI  మ్యాపింగ్ సరిగా లేకపోతే లేదా యాక్టివ్గా లేకపోతే బ్యాంకు వెళ్లి సరిచేసుకోవాల్సి ఉంటుంది.

వెరిఫికేషన్ టైంలో తిరస్కరణకు గురైన కారణాలు ఇవే..

  • పరిశీలన సమయంలో భూ యజమాని మరణించినట్లు గుర్తించినా, వారసులకు పాస్ పుస్తకాల జాప్యం ఉన్నందున తిరస్కరించారు.
  • సాగు భూమికి ఆధార అనుసంధానం తో తప్పులు ఉన్న లేదా న్యాయపరమైన సమస్యలు ఉన్న తిరస్కరించడం జరిగింది
  • ఆక్వా, వ్యవసాయేతర భూములకు  వర్తించదు.
  • నెలకు 20,000 తీసుకునే ఉద్యోగస్తులు ఉన్న, పది సెంట్లు కంటే తక్కువ భూమి ఉన్నా వీరిని అనర్హులుగా పెట్టారు.
Farmers at Annadata Sukhibhava event

అమౌంట్ పడని వారు ఏమి చేయాలి

అన్నదాత సుఖీభవ అర్హత ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కారణంతో అమౌంట్ పడని వారు  ఆగస్టు 3 నుంచి రైతు సేవ కేంద్రాలలో అర్జీ పెట్టుకోవచ్చని ఢిల్లీ రావు వెల్లడించారు.

ముఖ్యంగా ఎన్పీసీఏ ఆక్టివ్ లేని వారు బ్యాంకులకు వెళ్లి సరి చేసుకోవాలని, ఈ కేవైసీ పూర్తికాని వారు రైతు సేవ కేంద్రంలో అర్జీ పెట్టుకోవచ్చని, పైన తెలిపిన ఏదైనా కారణం లో లోపం ఉన్నప్పటికీ కూడా అర్జీ పెట్టుకోవచ్చు అని వెల్లడించారు. [Annadatha Sukhibhava farmers can file grievances from August 3]

ఇక కవులు రైతుల విషయానికొస్తే ప్రస్తుతం అన్నదాత సుఖీభవ ఈ విడత అమౌంట్ కౌలు రైతులకు వర్తించదు వారికి అక్టోబర్ నెలలో అమౌంట్ జమ అవుతుందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ వెల్లడించారు.

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేయండి

ఆగస్టు రెండున ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కి సంబంధించి స్టేటస్ ను కింది లింక్స్ ద్వారా తెలుసుకోండి.

మీ బ్యాంకు యొక్క ఎన్పీసీఐ మ్యాప్ అయిందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

|సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వాట్సాప్ లో పొందేందుకు క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి సంబంధించిన కీలక అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు క్లిక్ చేయండి
Click here to Share

6 responses to “అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ కాలేదా, ఇలా చేయండి”

  1. AITAMSETTI PADMA Avatar
    AITAMSETTI PADMA

    We didn’t receive any Amount Of Annadatha sukhibhava

  2. S NAGAMUTYALA NAIDU Avatar
    S NAGAMUTYALA NAIDU

    10సెంట్లు భూమి ఉన్న వారికీ ఏమి ఇస్తారు

  3. Boya Nagesh Avatar
    Boya Nagesh

    problem

  4. Redrowthu DasaradaRamaiah Avatar
    Redrowthu DasaradaRamaiah

    Annadata sukhibhava amount not received.

  5. SHAIK ALTHAF Avatar
    SHAIK ALTHAF

    annadata-sukhibhava Amount not credited

  6. Pachhigottimadhu Avatar
    Pachhigottimadhu

    Pm kissan not a Credited my a/c no

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page