PM Kisan 20th Installment 2025 Release Date: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. రైతులు ఎదురు చూస్తున్న 20 వ విడత PM కిసాన్ సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. PM కిసాన్ 20 వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 3 విడతల్లో పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంది. ఇప్పటికే 19 విడతలుగా అమౌంట్ చెల్లించిన కేంద్రం, తాజాగా 29 వ విడత నిధుల విడుదల కు ముహూర్తం ఖరారు చేసింది.

20వ విడత పిఎం కిసాన్ ఆరోజే [PM Kisan 2025 Release Date]?
అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం-కిసాన్ (PM Kisan) పథకం 20వ విడత నిధుల (PM Kisan 20th installment) విడుదలకు తేదీ ఖరారైంది. ఆగస్ట్ 2 వ తేదీన రూ.2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 20వ విడతలో 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన రైతులు ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతాను కలిగిఉండాలి. అలాగే, ఇ-కేవైసీ చేసి ఉండాలి.
దేశవ్యాప్తంగా సుమారు 9.8 కోట్ల మంది రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల చొప్పున నిధులను జమ చేయనుంది.
అయితే ఈ కేవైసీ పూర్తి అయిన వారికి మాత్రమే ఈసారి కూడా అవకాశం. ఒకవేళ మీరు గత విడత గడువు తర్వాత ఈ కేవైసీ పూర్తి చేసినట్లయితే అటువంటి వారికి రెండు విడతలకు సంబంధించినటువంటి అమౌంట్ ఖాతాలో పడనుంది.

ఈ డేట్ లోపు ఈ కేవైసి పూర్తి చేసుకోండి [PM Kisan 2025 Release Date]
PM కిసాన్ అధికారిక వెబ్సైట్ లో గాని లేదా మీసేవ ద్వారా గానీ ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం గత కొన్ని విడతలుగా పీఎం కిసాన్ నిధులు జమ చేస్తూ వస్తుంది. ఈసారి కూడా kyc పూర్తి అయిన వారికి మాత్రమే 20 వ విడత నిధులు జమ అవుతాయి.
ఎవరైతే రైతులు ఇంకా ekyc పూర్తి చేయలేదో అటువంటి వారు వెంటనే మీ రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్ ఉపయోగించి కింది లింక్ ద్వారా ఈకేవైసి పూర్తి చేయవచ్చు. ekyc పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ విడత అమౌంట్ పడుతుంది.
Click here for the PM Kisan ekyc link

పిఎం కిసాన్ 2025 స్టేటస్ ఎలా చెక్ చేయాలి [PM Kisan 2025 Release Date]
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM Kisan సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్, EKYC స్టేటస్ మరియు జాబితాలో మీ వివరాలు, అర్హతను కింది. ప్రాసెస్ ఫాలో అయ్యి సులభంగా తెలుసుకోవచ్చు.
PM Kisan status కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అన్నదాత సుఖీభవ అమౌంటును ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ విడుదల అయిన రోజు జమ చేస్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ రెండు కలిపి ₹7,000 ఈ విడతలో జమ కానుంది.
ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పేరుతో ప్రభుత్వం నిధులు విడిగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. కావున పిఎం కిసాన్ 2000 రూపాయలు తెలంగాణ రైతులకు ఈ విడత లో జమవుతాయి.
Leave a Reply