అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక అప్డేట్ ని ప్రభుత్వం వెల్లడించింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా తమ పేర్లు అర్హుల జాబితాలో లేనట్లు పలువురు రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీరికి చివరి అవకాశం కల్పించింది. జూలై 23 వరకు గ్రీవెన్స్ పెట్టుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది.
జూలై 23 వరకు చివరి అవకాశం
అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునే ఆప్షన్ని ప్రభుత్వం ఇప్పటికే కల్పించిన విషయం తెలిసిందే. ఒకవేళ స్టేటస్ లో అర్హత ఉన్నప్పటికీ కూడా అనర్హులుగా చూపిస్తున్నా, రైతు సేవ కేంద్రాల వద్ద అర్హుల జాబితాలో పేరు లేకపోయినా, ఇటువంటి వారందరికీ ప్రభుత్వం మరొక చివరి అవకాశం కల్పించింది.
జూలై 23 వరకు మీ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ సహాయకుల సహకారంతో గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు చేసే ఆప్షన్ ని కల్పిస్తున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకటించారు.
గతంలో జూలై 13 వరకు ప్రభుత్వం ఆప్షన్ కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరికొంతమంది రైతులు ఇంకా అర్హత ఉన్న లబ్ధి పొందడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కావున రైతులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ వ్యవసాయ సహాయకులను సంప్రదించి గ్రీవెన్స్ పెట్టవచ్చు.
|అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్స్అప్ లో పొందేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply