అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన  పాయింట్స్

అన్నదాత సుఖీభవ సంబంధించి ముఖ్యమైన  పాయింట్స్

అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ తో పాటు జూలై నెలలోనే విడుదల కానున్న నేపథ్యంలో రైతులు ఈ ముఖ్యమైన అంశాలు(Annadatha Sukhibhava important points) తప్పక తెలుసుకోవాలి.

ఇందులో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ సంబంధించిన గైడ్లైన్స్, కౌలు రైతులకు అమౌంట్ ఎప్పుడు పడుతుంది, అనర్హత ఉన్నవారికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆధార్ అనుసంధానం, అన్నదాత సుఖీభవ స్టేటస్ తదితర అంశాల పై ఉన్న అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి

  • ✓ ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వ భూమి సాగుదారులు అనర్హులు.  పట్టా భూమి కలిగిన వారు డీకేటీ పట్టాదారులు, అసైన్డ్, ఇనాం భూములు ఉన్నవారు అర్హులు.
  • దేవాదాయ భూముల్లో సాగుచేస్తున్న రైతులు మరియు కౌలు రైతులకు మాత్రం పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం అమౌంట్ జమ చేయనుంది. అయితే వీరికి మాత్రం జూలై నెలలో అమౌంట్ పడదు. వీరికి అక్టోబర్ మరియు జనవరిలో రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ అమౌంట్ మాత్రమే జమ చేయబడుతుంది.
  • ✓ పథకం లబ్ధి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అందిస్తున్నారు. గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు ఉన్నప్పటికీ కొంతమందికి అమౌంట్ వచ్చింది. అయితే ఈసారి మరింతగా పరిశీలన చేసి అటువంటి వారిని తొలగించినట్లు తెలుస్తోంది. కొంతమంది పెళ్లి అయిపోయి వేరే కుటుంబం లా ఏర్పడితే వారు గ్రామవార్డు సచివాలయాలలో కుటుంబ సర్వే పూర్తిచేయించుకోవాలి.
  • ✓ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయ్యి పెన్షన్ పొందుతున్న వారు,  ఆదాయం పన్ను చెల్లింపుదారులు, ఒకే కుటుంబంలో ఒకరికి మించి పేర్లు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. అయితే పైన పేర్కొన్న విధంగా ఒకరికి మించి లబ్ధిదారులు ఉంటే ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుంది.
  • ✓ ఆధార్ అనుసంధానం తప్పనిసరి. రైతు భూమి వెబ్‌ ల్యాండ్‌లో వేరొక ఆధార్‌తో అనుసంధానం చేసి ఉంటే సంబంధిత రెవెన్యూ సిబ్బందిని కలిసి వెబ్ ల్యాండ్ లో కరెక్ట్ ఆధార్ ను అనుసంధానించుకోవాలి. తప్పు ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్నా, చనిపోయిన వారి భూమి మ్యుటేషన్‌ ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ,  వెబ్‌ల్యాండ్‌లో ఆధార్‌ కు జత కాలేదని గుర్తించినా కూడా ఇటువంటి వారందరూ సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి డేటా సరిచేసుకున్న తరువాత మీ సమీప రైతు సేవా కేంద్రానికి వెళ్లి వ్యవసాయ అధికారులను కలవాల్సి ఉంటుంది.

అన్నదాత సుఖీభవ అర్జీలకు జూలై 13 చివరి తేదీ

అన్నదాత సుఖీభవ అర్హత ఉన్నప్పటికీ అనర్హులుగా స్టేటస్ లో కనిపిస్తే అటువంటివారు జూలై 13 లోపు అర్జీ పెట్టుకోవచ్చు. అర్జీ పెట్టుకునేందుకు మీ సమీప రైతుసేవ కేంద్రంలో సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పటికే అర్జీలు పెట్టుకొని అర్హత సాధించిన వారికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేయాలి

అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు తమ ఆధార్ నెంబర్ ఉపయోగించి నేరుగా మొబైల్ నుంచి మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

ఇందుకోసం మీరు కింది లింక్ వీక్షించి, మీ ఆధార్ ఎంటర్ చేసి మీ స్టేటస్ పొందవచ్చు. అర్హత ఉన్నవారికి Eligible అని, ఒకవేళ మీకు అనర్హత ఉంటే Ineligible అని చూపిస్తుంది. అనర్హత ఉంటే ఎందుకు అనర్హత ఉందో కూడా పక్కన కారణం కనిపిస్తుంది.

అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ ఎప్పుడు జమవుతుంది

అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ ఈ రెండూ ఒకేరోజు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే పిఎం కిసాన్ జమ చేస్తుందో అదే రోజున అన్నదాత సుఖీభవ కూడా జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే పీఎం కిసాన్ 20 ఇన్స్టాల్మెంట్ జూలై నెలలోనే జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూలై 18వ తేదీ బీహార్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అన్నదాత సుఖీభవ అమౌంట్ జమ చేస్తారని పలు మీడియా వర్గాలు ప్రకటిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

|అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందటానికి వాట్సప్ లో జాయిన్ అవ్వండి. వాట్సప్ లో జాయిన్ అయ్యేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page