ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత అమౌంట్ జూలై నెలలో విడుదల కానున్న నేపథ్యంలో రైతులు తమ అర్హతకు సంబంధించిన స్టేటస్ చూసుకునే ఆప్షన్ ని ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ ఈకేవైసీ కూడా తప్పనిసరి చేయడం జరిగింది. గతంలో ఉన్న డేటా ఆధారంగా ఈ కేవైసీ ఆటోమేటిక్గా ప్రభుత్వం చాలా మంది రైతులకు అప్డేట్ చేయటం జరిగింది. మరి కొంతమంది నుంచి ఇటీవల థంబ్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైనా రైతులు అర్హత ఉండి స్టేటస్ లో అనర్హత అంటే ineligible అని చూపిస్తున్నట్లయితే అటువంటి వారికి గ్రీవెన్స్ పెట్టుకునే ఆప్షన్ ని కల్పించింది.
అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 డెడ్ లైన్
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఉన్నప్పటికీ కూడా (Annadatha Sukhibhava Status) తమ స్టేటస్ లో ఇనేలిజిబుల్ అని చూపిస్తున్నట్లయితే అటువంటి వారికి ఫిర్యాదు చేయటానికి ప్రభుత్వం జూలై 13 వరకు అవకాశం కల్పించింది.
రైతులు తమ సమీప రైతు సేవ కేంద్రాలకు వెళ్లి తమ జాబితాను మరోసారి పరిశీలించుకుని, తమ పేరు అర్హత జాబితాలో లేకపోతే ఫిర్యాదు చేసే అర్జీని సమర్పించవచ్చు. ఫిర్యాదు చేసే సమయంలో తమ పాసుబుక్ తో పాటు తమ అర్హతకు సంబంధించిన కావలసిన డాక్యుమెంట్స్ కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
అనర్హత ఉన్నవారికి ఎందుకు అనర్హత ఉందో కూడా అన్నదాత సుఖీభవ స్టేటస్ పేజీ లో ఇప్పటికే చూపిస్తుంది.
అన్నదాత సుఖీభవ స్టేటస్ చేయడానికి కింద లింక్ పై క్లిక్ చేయండి.
అన్నదాత సుఖీభవ ఎప్పుడు జమ అవుతుంది?
అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ జూలై 18 వ తేదీన జమ అయ్యే అవకాశం ఉంది. అదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఇదే సభ నుంచి పీఎం కిసాన్ 20వ ఇన్స్టాల్మెంట్ జమ చేసే అవకాశం ఉన్నట్లు అంచనా. పీఎం కిసాన్ విడుదల చేసిన రోజునే అన్నదాత సుఖీభవ అమౌంట్ కూడా విడుదల చేస్తామని ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ వాట్సప్ లో పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Leave a Reply