ఏపీ ప్రభుత్వం పెన్షన్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త చెప్పింది. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా స్పౌస్ క్యాటగిరీలో కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కలిగించింది. ఈ కేటగిరిలో కొత్తగా 89,788 పెన్షన్లను అందించనుంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే తదుపరి నెల నుంచి భార్యకు పెన్షన్ అందించేలా ప్రభుత్వం ఈ కేటగిరీని సృష్టించింది. గతేడాది నవంబర్ నెల నుంచి ఈ కేటగిరీ ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు 4000 రూపాయలను అందిస్తున్నది.
అయితే అంతకుముందు డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31,2024 వరకు అర్హులైన వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది.
అర్హులైన మహిళలు భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు అవసరమైన డాక్యుమెంట్లతో సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. చేసుకున్న వారికి అర్హతను పరిశీలించి మే ఒకటి నుంచి పెన్షన్ పంపిణీ చేయనున్నారు.
ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పై 35.91 కోట్ల అదనపు భారం పడనుంది.
Leave a Reply