AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025- AP Disabled Pension Verification 2025 Full Process

Andhra Pradesh Disabled Pension Verification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ పెన్షన్ దారులకు జనవరి 20 , 2025 నుండి పెన్షన్ తనిఖీ & మరియు పునః పరిశీలన జరుగుతుంది .  దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అధికారులకు విడుదల చేసింది . 

ఏ ఏ పెన్షన్ దారులకు తనిఖీ చేయనున్నారు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కింద తెలిపిన దివ్యాంగ పెన్షన్ దారులకు పునః పరిశీలన మరియు తనిఖీ Andhra Pradesh Disabled Pension Verification 2025 చేయనున్నారు

  1. Orthopedic Handicaped / Locomotor [ ఎముకల సమస్య / లోకోమోటార్ ]
  2. Visaul Impariment [ దృష్టిలోపం ]
  3. Hearing Impariment [ వినికిడి లోపం ]
  4. Mental Retardation [ మానసిక మాంద్యం ]
  5. Mental Illness [ మానసిక అనారోగ్యం ]
  6. Multiple Illness [ ఒకటి కన్న ఎక్కువ సమస్యలు ]

ఎవరికి తనిఖీ చేయనున్నారని ఎలా తెలుస్తుంది ? 

దివ్యాంగ పెన్షన్దారులైనటువంటి వారిలో ఎవరికి తనిఖీ Pension Re Assessment చేయనున్నారో వారి యొక్క వివరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులైనటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ [ WEA ] మరియు వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ [WWDS ] వారి యొక్క SS Pension వెబ్సైట్ లాగిన్ లో తనిఖీ చేయవలసిన పింఛనుదారుల నోటీసులు జనరేట్ అవుతాయి.  

:: REQUEST ::

వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విన్నపం ఏంటంటే కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అయినట్టు అయితే వెంటనే ఇటువంటి అప్డేట్లు మీకు రోజు అందుతాయి.

నోటీసు పింఛనుదారునికి  ఎలా అందుతుంది ?

జనరేట్ అయినటువంటి సర్టిఫికెట్లను సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్దారుడు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్దారుని యొక్క ఆధార్ ధృవీకరణను Aadhaar Authentication బయోమెట్రిక్ ద్వారా లేదా ఫేస్ ద్వారా లేదా కళ్ళ ద్వారా  తీసుకొని నోటీసును పింఛన్దారులకు అందించడం జరుగుతుంది . సిగ్నల్ లేని ప్రదేశంలో అయితే ఆఫ్ లైన్ మోడ్లో అనగా పేపర్ పై సంతకం తీసుకొని నోటీసును పింఛన్దారులకు అందించడం జరుగుతుంది.

నోటీసులో ఏముంటుంది ?

పింఛనుదారులకు  తనిఖీ  సంబంధించి వివరాలు అన్నీ కూడా అంటే 

  • పింఛన్దారుని పేరు ఏంటి ?
  • పింఛన్దారిని పెన్షన్ ఐడి  ఏంటి ?
  • ఎక్కడ జరుగుతుంది ?  
  • ఏ రోజున జరుగుతుంది ? 

అనే వివరాలు నోటీసులో ఉంటాయి

నోటీసు అందుకున్న పింఛనుదారుడు ఏం చేయాలి ?

నోటీసు అందుకున్నటువంటి పింఛన్దారుడు నోటీసులో ఉన్నటువంటి ఆసుపత్రికి నోటీసులో ఇచ్చిన తేదీ నాడు తప్పనిసరిగా హాజరు అవ్వాలి . హాజరు అవ్వకపోతే  పింఛన్దారుని యొక్క పెంచను HOLD లోకి వెళ్తుంది అంటే  పెన్షన్ దారులకు పెన్షన్ తాత్కాలికంగా నిలుపుదల జరుగుతుంది . మరల Pension Verification 2025 వెరిఫికేషన్ అయ్యేంతవరకు పింఛనుదారులకు పెన్షన్ రాదు . అలా అని రద్దు కూడా అవ్వదు . 

పింఛన్దారుడు ఏం తీసుకొని వెళ్ళాలి ?

పింఛనుదారుడు పునః పరిశీలన Pension Verification 2025  కు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అతని వద్ద ఉన్నటువంటి  సదరం సర్టిఫికెట్ ఒరిజినల్ , ఆధార్ కార్డ్  ను తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి .  ఆసుపత్రికి తప్పనిసరిగా పింఛన్దారుడు వెళ్లాలి .  సదరం సర్టిఫికెట్లను బంధుమిత్రులతో పంపించడానికి కుదరదు . పింఛన్దారునికి తోడుగా ఎవరినైనా తీసుకొని వెళ్ళవచ్చు .  

పింఛన్ తనిఖీలో ఏం చూస్తారు ?

పెన్షన్ దారుడు తనకు కేటాయించిన ఆసుపత్రి కి కేటాయించిన తేదీనాడు వెళ్లిన తరువాత  తనకు సంబంధించిన  డాక్టర్లు తనిఖీలు లేదా పున పరిశీలన Pension Verification 2025 చేస్తారు.  అందులో భాగంగా తన వద్ద ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్  సరి అయినదా కాదో చెక్ చేస్తారు . అదేవిధంగా  వికలాంగుల కాదా అని చెప్పి మరలా రీ అసెస్మెంట్ చేస్తారు . రీ అసెస్మెంట్ Pension Verification 2025 పూర్తి అయిన తర్వాత వారి వద్ద ఉన్నటువంటి మొబైల్ యాప్ లో అన్ని వివరాలను నమోదు చేసి చివరగా పింఛనుదారునకు పెన్షన్ రికమండ్ చేస్తారా లేదా అని చెప్పి వివరాలను నమోదు చేస్తారు . 

పింఛను రద్దు ఎప్పుడు అవుతుంది ?

పించను తనిఖీ Pension Verification 2025 లో భాగంగా అర్హులైన వారికి ఎటువంటి సమస్య ఉండదు . ఎవరైతే భోగస్ సర్టిఫికెట్ మరియు వికలాంగులు కాకుండా సర్టిఫికెట్ పొంది పెన్షన్ పొందుతున్నారు వారికి మాత్రమే పెన్షన్ రద్దు అవుతుంది. అర్హులైన వారు తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ తనిఖీలు భాగం అవ్వండి.  పెన్షన్ తనిఖీల్లో హాజరు కానటువంటి వారి యొక్క పెన్షన్ హోల్డ్ లోకి వెళ్తుంది, దానివలన పెన్షన్ తాత్కాలిక నిలుపుదల జరుగుతుంది మరల రెండవసారి తెలిపిన పిదప హాజరు అవ్వకపోతే అప్పుడు పూర్తిగా పెన్షన్ రద్దు అవుతుంది .

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page