రాష్ట్రంలో పుట్టినప్పటి నుంచి ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోని 11,65,264 మంది చిన్నారుల కోసం ఈ నెల 21వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
కొత్త ఆధార్ ( బాల ఆధార్ )
- DOB Certificate తప్పనిసరి
- తల్లి / తండ్రి బయోమెట్రిక్ తప్పనిసరి
- థంబ్ వేసే వారి MBU అయి ఉండాలి. ఆధార్ Active లొ ఉండాలి. DOB లొ ఉన్న పేరు & ఆధార్ లొ ఉన్న పేరు సరి పోవాలి.
- కొత్త ఆధార్ కు, MBU అనగా తప్పనిసరి బయోమెట్రికు కు ఫీజు ఉచితం.
డిసెంబర్ నెల ఆధార్ క్యాంపులకు సంబంధించిన ఉత్తర్వులు
ఆధార్ క్యాంపులలో అందించే సర్వీసులు :
- కొత్తగా ఆధార్ కార్డు నమోదు
- 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్,
- ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరి డాక్యుమెంట్ అప్డేట్,
- బయోమెట్రిక్ అప్డేట్ చేసుకొని చాలా ఏళ్లయిన వారికి బయోమెట్రిక్ అప్డేట్ ముఖ్యంగా ఈ సర్వీసులు చేయడం జరుగును.
- మొబైల్ నెంబర్ లింకు, చిరునామా మాకు, పుట్టిన తేదీలో కరెక్షన్ ఈ సర్వీసులు కూడా జరుగును.
January Month Aadhar Camps Guidelines
- ముఖ్యంగా కొత్త ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ మరియు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరుగును.
- క్యాంపు సమయంలో PS Gr-VI ( DA ) / WEDPS వారి స్థానంలో ఇతర సచివాలయ సిబ్బందిని In-Charge వేస్తారు.
- ఎక్కడైతే క్యాంప్ ఉంటుందో ఆ సచివాలయ పరిధిలో ఇద్దరు సచివాలయ సిబ్బంది PS Gr-VI (DA) / WEDPS వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు గాను సహాయపడతారు.
- క్యాంపు మొత్తంలో 109 పైగా సర్వీసులు చేసినచో ₹500 /-, 200కు పైగా సర్వీసులు చేసినచో ₹1000/- లు PS Gr-VI (DA) / WEDPS వారికి ఇవ్వటం జరుగును.
- క్యాంపు సమయంలో జిల్లా కలెక్టర్లు జిల్లా పరిధిలో ఉన్నటువంటి అందరూ ఆధార్ PS Gr-VI(DA) / WEDPS వారి డిప్యూటేషన్ నుండి విడుదల చేస్తారు.
Other Details
సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలి.
UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.35 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
క్యాంప్ సమయం లో కనీసం 100 నమోదులు/అప్డేట్లను చేసిన వారికి , మొబైల్ క్యాంప్ నిర్వహణ కోసం హార్డ్‌వేర్ పరికరాల రవాణా కోసం ఏదైనా ఖర్చు చేస్తే, GVWV&VSWS డిపార్ట్మెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్లకు (డిజిటల్ అసిస్టెంట్/ WEDPS) రూ.500 అందజేస్తుంది.
Also Read
- మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ తెలుసుకునే పూర్తి విధానం – How To Know Aadhar Linked Mobile Number
- Pan Aadhar Link – ఆధార్ పాన్ లింకింగ్ కి జూన్ 30 లాస్ట్ డేట్.. పెండింగ్ ఉన్నవారు ఈ విధంగా ఆన్లైన్ లో లింక్ చేసుకోండి
- Aadhar Document Update Extended : ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. డాక్యుమెంట్ అప్డేట్ గడువు పెంపు
ఆన్లైన్ లో అయితే పూర్తి ఉచితంగా మీరే డాక్యుమెంట్ అప్డేట్ చేయవచ్చు. కింది ప్రాసెస్ చూడండి
సచివాలయంలో అందించే ఆధార్ సేవలు :
సేవలు | Service Charge |
---|---|
ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ | 50/- |
ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్ | 50/- |
బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్ | 100/- |
పేరు మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
DOB మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
జెండర్ మార్పు | 50/- |
ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి) | 50/- |
చిరునామా మార్పు ( Proof తప్పనిసరి ) | 50/- |
కొత్తగా ఆధార్ నమోదు | Free |
Mandatory Biometric Update | Free |
3+ Anyone Service | 100 |
Leave a Reply