ఇకపై వారికి పెన్షన్ అమౌంటు నేరుగా అకౌంట్లో జమ

,
ఇకపై వారికి పెన్షన్ అమౌంటు నేరుగా అకౌంట్లో జమ

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటికి దూరంగా చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ అమౌంట్ను వారి అకౌంట్లోనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారు ప్రతినెలా హాస్టల్ నుంచి సొంత ఊరికి వచ్చి పెన్షన్ నగదును తీసుకుంటున్నారు. ఇలా ప్రతినెలా రావలసి రావడంతో వారి తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం ఈ ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం  తీసుకుంది

దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ అమౌంట్ను నేరుగా వారి బ్యాంకు  అకౌంట్ లోనే డిబిటి విధానంలో చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇది కేవలం వేరే ప్రాంతాల్లో చదువుకునే చూడలేను దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే పరిమితం. మరియు పెన్షన్ అమౌంటు వారి బ్యాంక్ అకౌంట్ లో జమ జమ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన విద్యార్థులకు మాత్రమే ఈ వెసులుబాటు కలదు.

దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్

పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ  గారు తెలిపారు.

దీనికి కావలసిన పత్రాలు

ఇలా పింఛన్ డబ్బుల్ని ప్రతి నెలా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు

1. విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
2. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
3.ఆధార్ కార్డు నకలు
4. సదరం సర్టిఫికెట్
5. పెన్షన్ ఐడి o
6. స్కూల్ / కాలేజీ ఐడి
7. సెల్ఫ్ ఫోటో
8. MPDO గారు ధ్రువీకరిస్తూ పత్రం.

ఈ డాక్యుమెంట్లను DRDA PD కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతినెలా ఊరికి వెళ్లి డబ్బులు తీసుకునే పని లేకుండా.. నేరుగా బ్యాంక్ అకౌంట్‌లలోనే డబ్బుల్ని జమ చేయనున్నారు. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద 8.50 లక్షల మంది ప్రతి నెలా పింఛన్‌లు తీసుకుంటున్నారు. వీరికి వయసుతో సంబంధం లేకుండా 45 శాతం వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు పించన్ అందిస్తోంది ప్రభుత్వం. వీరిలో 10వేలమంది విద్యార్థులు గురుకులాలు, హాస్టల్స్‌లో చదువుకుంటూ పింఛను అందుకుంటున్నట్లు గుర్తించారు. వీరిలో సమ్మతి తెలిపిన వారికి బ్యాంక్ అకౌంట్‌లలోకి పింఛన్ డబ్బుల్ని జమ చేస్తారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page