ఈ పంట నమోదు గడువు పెంపు…షెడ్యూల్ ఇదే

ఈ పంట నమోదు గడువు పెంపు…షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ముఖ్యమైన గమనిక.. ఈ-పంటకు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ పంట / ఈ-క్రాప్ నమోదు చేసుకోవడానికి గడువు ఈనెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తాము సాగు చేస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇలా నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులవుతారని, వడ్డీలేని పంట రుణాలు, పంటల బీమా, కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది.

ఈ పంట షెడ్యూల్ ఇదే

రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌ ఊపందుకోవడంతో ఈ-పంట నమోదు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ-పంటకు సంబంధించి వాస్తవంగా సాగు చేస్తున్నవారి పేర్లనే నమోదు చేసుకోవాలి. ఇప్పటివరకు భూయజమాని ఒప్పుకుంటేనే పంట సాగుదారు పేరు కింద కౌలు రైతు పేరు చేర్చే వాళ్లు.. ఈసారి ఆ పరిస్థితి లేదు. పంట నష్టపోయినా.. బీమా, పెట్టుబడి రాయితీ సాగుదారుడికే దక్కాలని ప్రభుత్వం చెప్పింది. పంట సాగు చేసిన కౌలు రైతుకు 11 నెలలపాటు పంటపై హక్కు ఉంటుంది కాబట్టి.. ఆ కారణంతోనే వాస్తవ సాగుదారుడి పేరు నమోదు చేయాలి.

ప్రతి ఒక్కరూ ఈ నమోదు ప్రక్రియ సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రతి పొలం దగ్గరకు వెళ్లి గ్రామ వ్యవసాయ సహాయకులు జియోకోఆర్డినేట్స్‌ ఆధారంగా ఈ-పంట నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ పంట వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న వ్యవసాయ, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ సహాయకులు ఈ పంట నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని దిశా నిర్దేశం చెయ్యాలి.

You cannot copy content of this page