e-Crop Process

#


రైతులకు ముఖ్య సమాచారం:
🏞 𝐄 𝐂𝐑𝐎𝐏 𝐁𝐎𝐎𝐊𝐈𝐍𝐆 : మీ ఈ క్రాప్ స్టేటస్ కింది లింకు ద్వారా చెక్ చేయండి. New


ఈ - క్రాప్ (పంట నమోదు ప్రక్రియ) మార్గదర్శకాలు, స్టేటస్

ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ కింది లింక్ ద్వారా తెలుసుకోండి

E-CROP Status Checking link - మీ ఈ క్రాప్ బుకింగ్ స్టేటస్ తెలుసుకోండిNew


[ పై లింక్ ని క్లిక్ చేసి Kharif 2022 లేదా రబీ సెలెక్ట్ చేసి➔ మీ జిల్లా ➔ మీ మండలం ➔ గ్రామం ➔ ఖాతా నెంబర్/సర్వే నంబర్ ఎంటర్ చేసి మీ వివరాలు చూడవచ్చు ]

CROP Booking status check using Aadhar ఖరీఫ్ క్రాప్ స్టేటస్

[ పై లింక్ ని క్లిక్ చేసి Kharif లేదా రబీ ఎంచుకొని ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ వివరాలు చూడవచ్చు ]

Sunna Vaddi status check using Aadhar ఖరీఫ్ క్రాప్ స్టేటస్






ప్రతి సంవత్సరం ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో తప్పనిసరిగా ఈ కర్షక్ కార్యక్రమంలో రైతులు వేసిన పంటలను నమోదు చేయాలి.
వ్యవసాయ ప్రణాళిక ఇన్పుట్స్ రుణ ప్రణాళిక వంటి వాటితో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ మరియు పంట నష్టాల తాలూకు ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ పంటల బీమా పథకం తదితర కార్యక్రమాలకు ఈ కర్షక్ నమోదు సమాచారాన్ని ఉపయోగించడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్త తో తప్పు సమాచారమునకు అవకాశం లేకుండా నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ కర్షక్ నమోదు చేయడం ఎలా

⦿ గ్రామ సచివాలయం లో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హెచ్ లేదా sa6 సమన్వయంతో తమ పరిధిలో ఉన్న రైతులు తాము వేసిన పంటల తాలూకు వివరాలను మొబైల్ అప్లికేషన్ నందు నమోదు చేయాలి.
⦿ సీజన్ వారీగా ఖరీఫ్ రబీ మరియు వేసవి పంట కాలంలో విడివిడిగా నమోదు చేయాలి.
⦿సదరు గ్రామ సచివాలయ స్థాయిలో నమోదు ప్రక్రియను సంబంధిత వ్యవసాయ అధికారి పర్యవేక్షించి నమోదైన డేటాను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ఆధిక్యతను చేయవలసి ఉంటుంది.
⦿సంబంధిత సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు జిల్లా జెడిఎ కార్యాలయం నందలి ఒక బాధ్యతాయుత అధికారి ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పర్యవెక్షించవలసి ఉంటుంది.
⦿ ఇందుకుగాను జిల్లా జెడి గారు తమ కార్యాలయంలో పనిచేయుచున్న ఒక నోడల్ అధికారిని నియమించి కమిషనరేట్కు తెలియపరచాలి.

ఈ పంట నమోదు చేయు సమయంలో తప్పనిసరిగా పాటించవలసిన విషయాలు:

⦿ సాగు దారు రైతు యొక్క ఆధార్ నంబర్ నమోదు.
⦿ సర్వే నంబర్ యొక్క జియో కోఆర్డినేట్ ఉంటాయి కనుక నమోదు ప్రక్రియ తప్పనిసరిగా పంట వేసిన క్షేత్రం నుండి మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది.
⦿ నమోదు ప్రక్రియలో పట్టాదార్ ఏ సాగు చేస్తున్నప్పుడు వారి వివరములు నమోదు చేయవలసిన ఉంటుంది కానీ పట్టాదారు తాగుతారు వేరువేరుగా ఉన్న విషయంలో సాగు దారు వివరములు మాత్రమే నమోదు చేయాలి.
⦿ సాగు దారు సాగు చేయు అన్ని పంటల వివరాలు ఈ కర్షక్ లో నమోదు చేయవలసి ఉంటుంది.
⦿ అనగా వ్యవసాయ ఉద్యానవన పౌడర్ క్రాప్స్ మరియు పట్టు పరిశ్రమ పంటలన్నింటినీ నమోదు చేయాలి.
⦿ అంతరపంటలు నమోదు చేయునపుడు అంతర పంటలు వేసిన పంటలు నిష్పత్తి క్రమంలోనే పంట పేరు నమోదు చేయాలి.
⦿ ఉద్యాన పంటల నందు అంతర పంటలుగా ఉంటే వేసిన రెండు పంటలకు పూర్తి విస్తీర్ణం నమోదు చేయాలి.
⦿ ఒక రైతు ఒకే సర్వే నెంబర్లో ఉన్న విస్తీర్ణంలో మొత్తం లో ఒకటి కంటే ఎక్కువ పంటలు వేసినప్పుడు యాడ్ క్రాప్ ఆప్షన్ నందు వేసిన పంటల విస్తీర్ణం ప్రకారం విడివిడిగా నమోదు చేసి విడివిడిగా ఫోటో అప్లోడ్ చేయి ఆప్షన్ ఉంది.
⦿ వెబ్ లాండ్ లో గాని సి సి ఆర్ సి లో గాని రైతు పేరు లేకుండా ఉండి పంట నమోదు ప్రక్రియలో పార్టీ రైతు వచ్చినప్పుడు పూర్తి ఆధారాలను పరిశీలించి తృప్తి చెందిన తర్వాత యాడ్ ఫార్మర్ ఆప్షన్లు నమోదు చేయాలి.
⦿ విస్తీర్ణము తాలూకు వివరాలు నమోదు చేసుకొన వచ్చును.
⦿ కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్లు ఇప్పించుట కు భూ యజమాని రైతులను వీలు అయినంత వరకు తగిన భరోసాతో ఆమోదం కొరకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ సదరు భూ యజమాని తిరస్కరించినప్పుడు వాస్తవ సాగుతారు అనగా కౌలుదారు వివరములు తప్పనిసరిగా నమోదు చేయవలసి ఉంటుంది.
⦿ దీర్ఘకాలిక పంటలు అనగా పండ్లు పూలతోటలు నమోదు విషయంలో వయసు నమోదు చేయు ఆప్షన్ పంట విత్తనాలు తేదీతో పాటు గా ఇవ్వడం జరిగింది.
⦿ నమోదు చేయు అధికారి పంటల నమోదు ఆఫ్లైన్ నందు నమోదు చేసి తప్పులు సవరించి ఇంటర్నెట్ ఉన్న ప్రదేశంలో దానిని అప్లోడ్ చేసే అవకాశం కల్పించబడినది రచయిత అప్లోడ్ చేసే డేటా నందు తప్పులు దొరల డానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.
⦿ ఒక రోజుకు 75 నుంచి 100 కోట్లు మాత్రమే నమోదు చేయటానికి వీలు కల్పించడం మూలంగా నమోదు చేయు అధికారి అత్యంత జాగరూకతతో వాస్తవ విషయాలను నమోదు చేయడానికి అవకాశం కలదు.
⦿ గోదావరి డెల్టా కృష్ణా డెల్టా ప్రాంతాలలో వరి పొలం గట్ల మీద వేసిన ఉద్యాన పంటల జట్ల సంఖ్యను నమోదు కొరకు ఆప్షన్ కల్పించడం.
⦿ ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఈ కేవైసీ విధానమును జోడించడం ముఖ్యమైనది నమోదు చేసిన ప్రతి రైతు యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా బొటనవేలి ముద్ర తీసుకోవడం వలన ప్రతి రైతు వాస్తవ సమాచారం నమోదు అవుతుంది.
⦿ అర్బన్ ప్రాంతాలలో కలిసిన రూరల్ ప్రాంతాల్లో తాలూకు పంటల నమోదు ప్రక్రియ ఆయ పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తో నమోదు చేయవలసి ఉంటుంది.
⦿ జె డి ఏ వారి కార్యాలయం నుండి ఇ నోడల్ అధికారి ఎ డి ఎ కార్యాలయంలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్ వారు ఎప్పటికప్పుడు నమోదు ప్రక్రియను రోజువారి పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరణ నిర్వహించవలసి ఉంటుంది.
⦿ ఈ విధంగా నమోదు చేసిన డేటాను మనము ముందు వివిధ పథకాల నిర్వహణ ఉపయోగించడం జరుగుతుంది అనగా పంటల భీమా తాలూకు నష్టపరిహారం వివిధ ప్రకృతి వైపరీత్యాల వలన జరిగే నష్టం పెట్టుబడి రాయితీ ఇతర అన్ని రాయితీలు రైతుల నుండి కొనుగోలు కు సంబంధించిన విషయంలో నూ దీనిలో నమోదైన రైతులు నుండి మాత్రమే తీసుకోబడుతుంది.
⦿ నమోదు ప్రక్రియ సజావుగా జరగడానికి నమోదు ప్రక్రియకు ముందు గ్రామంలో రైతులు అందరికీ తెలిసే విధంగా దండోరా ఇచ్చినట్లయితే నమోదు ప్రక్రియలో రైతుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోనవచ్చును.
⦿ పంట నమోదు ప్రక్రియ యొక్క ఆవశ్యకత గురించి రైతులకు అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం ఉంది. కావున అందుబాటులో ఉన్న అన్ని మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది.
⦿ నమోదు ప్రక్రియకు సంబంధించి VAA లేదా VHA లేదా VSA మరియు వీఆర్వోలకు లాగిన్ పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. అదనంగా ఇందులో ఇన్ వాళ్లు అయినా ఇతర ముఖ్యమైన అధికారులకు కూడా లాగిన్ పాస్వర్డ్ ఇవ్వబడుతుంది.
⦿ ఏదైనా పంటల నమోదు ప్రక్రియలో తప్పులు దొర్లడం గమనించినప్పుడు జెడిఎ ఆఫీస్ నందు నియమింపబడిన నోడల్ అధికారి అనుమతితో మాత్రమే సవరణ చేయడానికి అవకాశం కల్పించబడింది.

#

JOIN Our Telegram Group

  • #
  • #
  • #
  • #