దేశంలోనే అత్యంత వేగవంతమైన వందేభారత్ రైళ్లు ఇకపై రంగు మార్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ నీలం రంగులో ఉండే రైలు బోగీలు ఇకపై కాషాయం రంగులో కనిపిస్తాయి. కొత్తగా తయారు చేసే రైళ్లకు కాషాయం రంగు వేస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో వందేభారత్ రైలు కోచ్‌లు తయారవుతున్నాయి.
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఫ్యాక్టరీని సం
దర్శించారు. రైలు బోగీలోకి వెళ్లి సీట్లను పరిశీలించారు. లోకో పైలెట్ జోన్లోకి కూడా వెళ్లి అన్నీ సరిగ్గా అమర్చారా లేదా అని పరీక్షించి చూశారు.
ఈ కొత్త రైళ్లు బూడిద, కాషాయం రంగు కలయికతో ఉన్నాయి. మన దేశ జెండా త్రివర్ణ పతాకం స్ఫూర్తితో ఈ రంగుల్ని ఎంపిక చేసినట్టుగా అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
“వందేభారత్ రైళ్లు మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందిస్తున్నాం. ప్రస్తుతమున్న రైళ్లలో లోటు పాట్లు గురించి సమాచారాన్ని సేకరించి కొత్తగా నిర్మించే కోచ్‌ని మరింతగా మెరుగుపరుస్తున్నాం” అని వైష్ణవ్ వివరించారు.