తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. మరో రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 24న ప్రధాని నరేంద్రం మోదీ ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్ మరియు కాచిగూడ-యశ్వంత్‌పూర్ కూడా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి క్రేజ్ లభిస్తోంది.
విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్
విజయవాడ-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) లాంఛింగ్ డేట్ ఫిక్స్ చేసింది. విజయవాడ-చెన్నై రూట్‌లో వందే భారత్ రైలు పరుగులు తీయబోతోంది. ఈ రైలును రేణిగుంట మీదుగా నడపాలని రైల్వే నిర్ణయించింది.
విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ తేదీ
విజయవాడ-చెన్నై వందేభారత్ రైలును కూడా ప్రధాని మోదీ ఈ నెల 24న వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) అధికారులు బుధవారం తెలిపారు. మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు ఈ రైలు అందుబాటులోకి వస్తుంది.
విజయవాడ-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్
ఈ రైలు గురువారం మినహా వారంలో అన్ని రోజులు నడపబడుతుంది. విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి..రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకుంటారు. ఈ వందేభారత్ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో స్టాప్‌లుఉన్నాయి. రైల్వే అధికారుల ప్రకారం.. కొత్త వందే భారత్ రైళ్లలో ప్రయాణీకుల మెరుగైన సౌకర్యాల కోసం అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) లాంఛింగ్ డేట్ ఫిక్స్ చేసింది. కర్నాటక ఎన్నికల సమయంలోనే ఈ రూట్‌లో ఎక్స్‌ప్రెస్ లాంఛ్ అవుతుందన్న వార్తలొచ్చాయి. కానీ కర్నాటకలో ఎన్నికలు ముగిసినా ఈ వందే భారత్ రైలు లాంఛ్ కాలేదు. కాచిగూడ-యశ్వంత్‌పూర్ రూట్‌లో వందే భారత్ రైలు పరుగులు తీయబోతోంది. ఈ రైలును కర్నూల్ మీదుగా నడపాలని రైల్వే నిర్ణయించింది. ఈ రైలు రాయిచూర్ మీదుగా వెళ్తుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ చివరకు కర్నూల్ మీదుగానే కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు నడపాలని రైల్వే నిర్ణయించింది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ తేదీ
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ట్రయల్ రన్ గురువారం నిర్వహించింది రైల్వే.
సెప్టెంబర్ 24న ఈ రైలును వర్చువల్ ఈవెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛ్ చేస్తారు. మరుసటి రోజు నుంచి ప్రయాణికులకు ఈ రైలు అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు 610 కిలోమీటర్ల దూరాన్ని 8.30 గంటల సమయంలో కవర్ చేస్తుంది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్
ఈ రైలు షెడ్యూల్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్టే. ఈ వెందే భారత్ రైలు కాచిగూడలో ప్రతీ రోజు ఉదయం 5.30 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి, రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మార్గం షెడ్యూల్
కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు రైలు బయల్దేరితే మహబూబ్‌నగర్‌కు ఉదయం 7 గంటలకు, కర్నూల్ సిటీకి ఉదయం 8.40 గంటలకు, అనంతపూర్ రైల్వే స్టేషన్‌కు ఉదయం 10.55 గంటలకు, ధర్మవరం రైల్వే స్టేషన్‌కు ఉదయం 11.30 గంటలకు, యశ్వంత్‌పూర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.
యశ్వంత్‌పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మార్గం షెడ్యూల్
ఇక తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు ఈ రైలు బయల్దేరితే ధర్మవరం రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 5.20 గంటలకు, అనంతపూర్ రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 5.41 గంటలకు, కర్నూల్ సిటీకి రాత్రి 7.51 గంటలకు, మహబూబ్‌నగర్‌కు రాత్రి 9.40 గంటలకు, కాచిగూడకు రాత్రి 11.15 గంటలకు చేరుకుంటుంది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆగే స్టేషన్లు
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు ఒక్క బుధవారం తప్ప మిగతా రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు దారిలో మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, అనంతపూర్, ఢోన్, ధర్మవరం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు మధ్య 20 రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. సూపర్‌ఫాస్ట్, రాజధాని, మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రైళ్లలో రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. వందే భారత్ రైలులో వెళ్తే ప్రయాణికులకు సుమారు 4 గంటల సమయం ఆదా అవుతుందని అంచనా