పృథ్వీరాజ్ చౌహాన్! చరిత్ర ఎరుగని రాజసం ఈయనకే సొంతం. హిందూ గొప్ప చక్రవర్తుల జాబితాలో మొదటి వరుస లో నిలిచే పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
పృథ్వీరాజ్ చౌహాన్, ఈయన చౌహన్ లేదా చహమన రాజ్య వంశానికి చెందిన చక్రవర్తి.1178-1192 AD వరకు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించారు. ఈయన ప్రస్తుత రాజస్థాన్,ఢిల్లీ , హర్యానా ప్రాంతాలను అజ్మీర్ రాజధాని గా పరిపాలించారు.
గజిని ని పరిపాలిస్తున్నటువంటి మొహమద్ ఘోరి 1191 లో ఈయన పై దండెత్తి వచ్చాడు. అదే మొదటి తారైన్(ప్రస్తుత హర్యానాలో) యుద్ధం.ఆ యుద్ధంలో లో చిత్తుగా ఓడిపోయి ఘోరీ తిరిగి గజినీ పారి పోవడం జరిగింది.
గజిని వెళ్లిన ఘోరీ తన బలాన్ని కూడగట్టుకొని మరలా 1192లో యుద్ధానికి అదే ప్రాంతానికి రావడం జరిగింది. అదే రెండవ తరైన్ యుద్ధం.యుద్ధానికి వచ్చిన సమయంలో నేను యుద్ధానికి రాలేదు సంధి చేసుకోవటానికి వచ్చాను అని ఘోరీ పృధ్వీరాజ్ చౌహాన్ తో చెప్పి మోసగించి, పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యం నిద్రపోతున్న వేళ వారిపై రాత్రిపూట దాడి చేసి ఆ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడిస్తాడు.
ఆ తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ ని గజిని కి బంధించి తీసుకెళ్లడం జరిగింది. పృధ్వీరాజ్ చౌహాన్ అప్పటికి తలవంచలేదు..అంతటి గొప్ప పరాక్రమవంతుడు ఆయన. దీంతో కోపగించిన ఘోరీ తన రెండు కళ్లను తీసి వేసి పృథ్వీరాజు ను జైలులో బంధించాడు.
పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఆస్థానకవి అయినటువంటి చంద్ర వర్దై రచించిన రసో గ్రంథంలో వివరించిన విధంగా,
పృథ్వీరాజ్ చౌహాన్ శబ్దతరంగాలను అనుసరించి కూడా బాణప్రయోగం చేయగల దీరుడు. దీనినే శబ్ద వేధ వాన్ విద్య అని అంటారు. దీనిని నమ్మని ఘోరీ ఒక రోజు ఆయనకి పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షకు ఘోరీ ఒప్పుకునేందుకు చంద వర్డై కూడా సహాయం చేసినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ పరీక్షలో రెండు కళ్లు లేనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ను తనపై బాణప్రయోగం చేయమని తెలిపాడు.
పృధ్వీరాజ్ చౌహాన్ శబ్దతరంగాలు ని అనుసరించి సింహాసనం మీద కూర్చున్న టువంటి ఘోరిని ఒకే బాణంతో మట్టు పెట్టాడు. ఆ తర్వాత శత్రువుల రాజ్యంలో చనిపోవడం ఇష్టం లేని తాను ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు అందులో పేర్కొనటం జరిగింది.
భారతదేశ చరిత్రలో అజరామరంగా నిలిచిపోయే మహా చక్రవర్తులలో పృథ్వీరాజ్ చౌహాన్ ఒకరు. ఆయన ధైర్యసాహసాలు అందరికీ స్ఫూర్తిదాయకం.