నీరా (Neera ) – అనేది తాటి, ఈత వంటి చెట్ల నుంచి తీసినటువంటి పానీయం. సహజంగా తాటి చెట్ల గెలల నుంచి ఈ నీరా ద్రవం సేకరిస్తారు. దీనిని సూర్యోదయానికి ముందే సేకరిస్తారు.
నీరా లో alchohol ఉంటుందా? [Does neera contains alchohol]
చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే నీరా లో alchohol (మద్యం) ఉంటుందా అని.. అయితే వాస్తవానికి నీరా లో ఎటువంటి మద్యం అనగా alchohol ఉండదు.
కానీ దీనిని ఫ్రెష్ గా తాగితెనే అది నీరా అంటారు. ఈ నీరా కు త్వరగా పాడై పోయే గుణం ఉంటుంది. కాబట్టి alchohol లేకుండా తాగే వారు వెంటనే తాగాలి.
నీరా కి కల్లు కి తేడా ఎంటి? నీరా కల్లు గా మారుతుందా?
నీరా కల్లు గా మారుతుందా అంటే అవును. మనం చెప్పుకున్న విధంగా నీరా సహజత్వాన్ని కోల్పోకుండా ఉండాలి అంటే దానిని తీసిన వెంటనే తాగాలి. లేదా 4 డిగ్రీ ల ఉష్ణోగ్రత వద్ద సహజత్వం కోల్పోకుండా కొన్ని ప్రక్రియల ద్వారా భద్రపరచాలి. లేదంటే నీరా కు త్వరగా పులియబడే గుణం ఉంటుంది. తద్వారా అది కొన్ని గంటల్లోనే కల్లు గా మారుతుంది. కల్లు లో 4% alchohol ఉంటుంది అనేది మనకు తెలిసిందే.
నీరా వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎంటి? [Health Benefits of Neera drink ]
నీరా లో amino acids, విటమిన్ C, B పుష్కలంగా లభిస్తాయి. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అజీర్తి, మల బద్ధకం, పచ్చ కామెర్లు వంటివి రాకుండా ఈ పానీయం దోహద పడుతుంది. ఇందులో ఉండే probiotics, రోగ నిరోధక శక్తిని పెంచి పొట్ట ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు దోహద పడతాయి. కంటి చూపుకు కూడా ఇది మంచిది. పిల్లలు పెద్దలు ఈ పానీయాన్ని తాగవచ్చు. ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ కాబట్టి మధుమేహ రోగులు కూడా నీరాను డాక్టర్ సలహా మేరు తాగవచ్చు. అయితే ఎవరైనా సరే దీనిని ఫ్రెష్ గా మాత్రమే తాగాలి. లేట్ చేస్తే ఇది కల్లు గా మారుతుంది. గమనించ గలరు.
Note: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మీ వైద్యున్ని సంప్రదించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి.
Neera Cafe గురించి తెలుసుకుందాం
తెలంగాణ ప్రభుత్వం కల్లు గీత కార్మికులను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర్లో నక్లేస్ రోడ్డు లో నీరా కేఫ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు శాస్త్రీయ అధ్యయనం చేసి నీరా ను ప్రత్యేకంగా దాని సహజత్వాన్ని కోల్పోకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో 7 స్టాళ్లు ఉన్నాయి. ఒకేసారి 500 మంది కుర్చునెలా ఏర్పాట్లు చేశారు.ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటుంది .ఇక్కడ Take away అంటే పార్సెల్ ఆప్షన్ ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది.