మార్చ్ 20 ని ప్రతి ఏటా అంతర్జాతీయ ఆనంద దినోత్సవం International Day of Happiness గా మనం జరుపుకుంటున్నాం.
అసలు ఎంటి ఈ హ్యాపీనెస్ డే? ఇందులో మన దేశం ఏ స్థానంలో ఉంది? దేశంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రపంచ ఆనంద దినోత్సవం ఎలా మొదలైంది?
సంతోషాన్ని ఒక ప్రాథమిక హక్కుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సంతోషంగా జీవించేలా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటాము.
ప్రజలు తమ జీవితంలో సంతోషం గా గడపడం ఎంతో అవసరం. దీని ప్రాముఖ్యత ను గుర్తించిన ఐక్య రాజ్య సమితి 2012లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.
అసలు ఎలా మొదలైంది అంటే?
మన పక్కనే ఉన్న చిన్న దేశం భూటాన్ ఇందుకు నాంది పలికింది అని చెప్పవచ్చు. తమ దేశ పౌరుల శ్రేయస్సు, సంతోషాలను కొలవడానికి తొలిసారిగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించింది. ఈ మేరకు 1972లో, భూటాన్ రాజు జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్ “స్థూల జాతీయోత్పత్తి కంటే స్థూల జాతీయ సంతోషం ముఖ్యం” అని ప్రకటించాడు, భౌతిక సంపద కంటే సంపూర్ణ శ్రేయస్సు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఈ తత్వశాస్త్రం అప్పటి నుండి ప్రపంచ గుర్తింపు పొందింది.
ఈ మేరకు ఐక్యరాజ్యసమితి స్థూల జాతీయ సంతోషాన్ని స్థిరమైన అభివృద్ధికి సూచిగా స్వీకరించింది. 2011లో, ఐక్యరాజ్యసమితి మార్చి 20వ తేదీని అంతర్జాతీయ సంతోష దినంగా ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2013 నాటికి అన్ని సభ్య దేశాలు దీనిని పూర్తి గా ఆమోదించాయి. ఈ విధంగా మార్చ్ 20 న ప్రతి ఏటా అంతర్జాతీయ సంతోష దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తుంది.
ప్రపంచ సంతోష సూచీ లో మనం ఎక్కడ ఉన్నాం?
World Happiness Index – ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉండే 146 దేశాలలో ప్రజలు ఏ మేరకు సంతోషంగా జీవిస్తున్నారో తెలుసుకునేందుకు ఐక్య రాజ్య సమితి కి చెందిన Sustainable Solutions Netowrk సంస్థ ప్రపంచ సంతోష సూచీ ని ఏటా విడుదల చేస్తుంది.
ఇందులో మన భారత దేశం అట్టడుగున 136 వ స్థానం లో ఉండటం శోచనీయం. మనకంటే మన పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ లో కూడా ప్రజలు మనకంటే సంతోషంగా జీవిస్తున్నట్లు రిపోర్ట్ పేర్కొంది.
ఫిన్ ల్యాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నెథర్లాండ్స్ దేశాలు వరుసగా టాప్ 5 లో ఉన్నాయి.
ఎందుకు మనం అట్టడుగున ఉన్నాం? సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి
భారత్ వంటి అత్యదిక జనాభా ఉన్న దేశంలో అసమానతలు, పేదరికం కూడా ఎక్కువే.. 161 దేశాల లో మన దేశం inequality అసమానతల సూచీ లో 123 లో ఉండటం ఇందుకు నిదర్సనం.
మన దేశం లో 1% మంది 22% దేశ సంపద ఉంది. 10% సంపన్నుల దగ్గర దేశంలో నే 57% సంపద ఉంది. దిగువ న ఉన్న 50% మంది దగ్గర 13% సంపద ఉందంటే ధనిక పెదల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో తెలుస్తుంది.
ఇవన్నీ ఒక కారణమైతే, మనిషి స్వతహాగా అన్ని ఉన్నా సంతోషంగా గడపడం మరచిపోవడం మరో కారణం. ఉరుకుల పరుగుల జీవితంలో సగటు మనిషి నిత్యం పని లో , డబ్బు సంపాదన లో నిమగ్నమై పోవడం , సంతోషంగా కుటుంబంతో గడపకపోవడం ఇటీవల ఎక్కువైంది.
ఏది ఏమైనా మనకున్న కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా.. ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మనతో పాటు మన చుట్టూ పక్కల వారు కూడా ఆనందంగా ఉండేలా ప్రేరెపించాలి. ఈరోజు అంతర్జాతీయ సంతోషం దినోత్సవం.. మీ సన్నిహితులకు కొంతమంది గురువులు చెప్పిన సూక్తులు.
* మీరు నిజంగా ఆనందంగా ఉంటే, సంతృప్తి కోసం వెతకరు.
* జీవితానికి కొంత వేగం ఉంటుంది. మీరు ఆనందంగా తొందరపడాలి కానీ, అసహనంగా ఎప్పుడూ ఉండకూడదు.
* మీకు ప్రపంచం పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, మీరు చేయవలసిన మొదటి పని మిమ్మల్ని మీరు సంతోషంగా చేసుకోవడం.