పంచభూతాలలో ఒకటైన నీరు మానవ మనుగడకు భగవంతుడు ప్రసాదించిన అమృతమని చెప్పవచ్చు. నీరు లేనిదే జీవం లేదు మీరు లేకపోతే సర్వం నిర్జీవం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భూమి పై మూడింట నీరే
భూమి యొక్క ఉపరితలంలో దాదాపు 71% నీటితో నిండి ఉంటుంది
భూమి పై సుమారు 1.386 బిలియన్ క్యూబిక్ కిలోమీటర్ల నీరు ఉంటుంది, దానిలో 97% ఉప్పునీటి రూపంలో మహా సముద్రాలు మరియు సముద్రాలలో ఉంది.
భూమి యొక్క నీటిలో దాదాపు 2.8% మంచినీరు ఉంటే, అందులోనూ 68.7% హిమానీనదాలు మరియు మంచు రూపంలో ఉంది. మిగిలిన దానిలో అత్యదిక భాగం 0.62% భూగర్భ జలాలు గా ఉంది.
ప్రపంచంలో మనకి భూ ఉపరితలం పై అందుబాటులో ఉండే మంచినీరు 1% అయితే, అందులోనూ నదులలో ఉండేది 1% అంటే 1/100 వంతు మాత్రమే.ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇక సరస్సు, చెరువుల్లో 1/2 వంతు ఉంటుంది. ఇంత తక్కువ నీటితో మనం మనుగడ సాధిస్తున్నాం.
భూమిపై అతిపెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రం అయితే ఆర్కిటిక్ సముద్రం అన్నిటికంటే చిన్న మహా సముద్రం. భూమిపై మొత్తం ఐదు మహాసముద్రాలు ఉన్నాయి. అవి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, ఆర్థిక మరియు అంటార్కిటిక్ సముద్రాలు..
పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్‌లో దాదాపు 36,070 అడుగుల (10,994 మీటర్లు) లోతులో ఉన్న ఛాలెంజర్ డీప్ భూమి పై ఉండే అన్నీ సముద్రాలలో అత్యంత లోతైన ప్రదేశం.
ప్రాణ కోటి మనుగడ కు నీరు చాలా అవసరం.
మానవ శరీరం దాదాపు 60% నీరు తో కోడి ఉంటుంది.శరీర పనితీరుకు తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం.
మానవ మెదడులో 75 నుంచి 80% నీరు ఉంటుంది.
మనిషి గుండె లో సుమారు 73% నీరు ఉంటుంది.
మన శరీరంలోని నీటి లో 2%శాతం కోల్పోయినా శారీరక పనితీరు గణనీయంగా దెబ్బతింటుంది. కాబట్టి నీరు అన్ని అవయవ భాగాలకు అత్యంత అవసరమైన ద్రావకం.
నీరు ఉంటేనే ఈ భూమి పై జీవం ఉంటుంది , నీరు లేకపోతే సర్వం నిర్జీవం అయిపోతుంది.
నీరు ఒక శక్తివంతమైన ద్రావకం, అనేక పదార్థాలు దీనిలో కరిగిపోతాయి.
నీటి చక్రం అనేది ఒక నిరంతర ప్రక్రియ, నీరు ఉపరితలం నుండి ఆవిరైపోయి, మేఘాలను ఏర్పరుస్తుంది, అవపాతం వలె భూమికి తిరిగి వస్తుంది ఆపై ప్రవాహాలు మరియు నదులలోకి ప్రవహిస్తుంది, చివరికి మహాసముద్రాలకు తిరిగి చేరుతుంది. ఈ విధంగా భూమిపై సకల జీవరాసులు మనుగడ సాధించడానికి వీలు పడుతుంది.
నీటిని మరిగించేందుకు 100 డిగ్రీల సెల్సియస్ (212 డిగ్రీల ఫారెన్‌హీట్) అవసరం, అయితే ఇది వాతావరణ పీడనాన్ని బట్టి మారవచ్చు.
ఘన, ద్రవ మరియు వాయువు – మూడు భౌతిక స్థితులలో సహజంగా భూమిపై కనిపించే ఏకైక పదార్ధం నీరు.
నీటిని ఈ విధంగా సంరక్షించుకుందాం
అవసరమైన నీటిని మాత్రమే వాడండి. ట్యాపులు, కుళాయిల నుంచి నీరు వృధాగా పోకుండా ఎప్పటికప్పుడు ఆఫ్ చేయండి
బ్రష్ చేసేటప్పుడు, షేవింగ్, స్నానం చేసేటప్పుడు, బట్టలు ఉతికే టప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే కుళాయిలు ఆన్ చేయండి. వృధాగా నీటిని పోకుండా చూడండి.
టాయిలెట్ లో అప్పుడపుడు సింక్ లో వాటర్ పోతు ఉంటుంది. కాబట్టి కింద వాల్వ్ దగ్గర ఆపేస్తే బెటర్.
మీ ఇంటి నీరు భూమి లోకి పోయే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెంచిన వారం అవుతాము.
మీ ఇంటి లో గార్డెన్ లేదా మొక్కలు ఉంటే, మీ వేస్ట్ వాటర్ ని వాటికి మల్లించెలా చేసుకుంటే ఇంకా కొంత నీరు ఆదా అవుతుంది.