Interesting Facts: అయోధ్య రామ మందిరం గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం

అయోధ్య రామమందిరం, ఇప్పుడు ప్రతి నోటా ఇదే మాట, ఇంతలా దేశవ్యాప్తంగా రామనామాన్ని వ్యాపింప చేసిన ఈ గొప్ప కట్టడం ఉత్తరప్రదేశ్‌లో ని అయోధ్యలో ఉంది. రాముడు జన్మస్థలం లో ఈ పవిత్ర మందిరం నిర్మించబడినందున దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పవచ్చు. రామ విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ 22 జనవరి 2024న జరుగుతుంది.

ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం గురించిన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

మతపరమైన మరియు చారిత్రక ప్రాముఖ్యత:

ఇది రామ జన్మ స్థలం : హిందూమతం మరియు ఇతిహాసమైన రామాయణంలో ప్రధాన వ్యక్తి, శక్తి అయిన శ్రీరాముని జన్మస్థలంగా విశ్వసించే స్థలంలోనే అయోధ్య రామమందిరం నిర్మించడం ఈ రామ మందిరం యొక్క గొప్ప తనం.

దేవాలయాల సమూహం: అయోధ్య, ఒక పవిత్ర నగరంగా పరిగణించబడుతుంది, వేల సంవత్సరాల నాటి చరిత్ర మరియు అనేక ఇతర ముఖ్యమైన దేవాలయాలు ఇందులో ఉన్నాయి. అయితే అన్నిటికి కేంద్ర బిందువు అయినటువంటి రామ మందిరం అయితే అన్నిటికి కేంద్ర బిందువు అయినటువంటి రామ మందిరం కొన్ని శతాబ్దాలు కనుమరుగై ప్రస్తుతం తిరిగి నిర్మితమవడం చారిత్రక ఘట్టం.

రామాయణం తో ముడి పడి: ఈ ఆలయ నిర్మాణం హిందువుల అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటుతుంది, రామాయణం నుండి నేటి తరం నేర్చుకోవలసిన విలువలు మరియు పాఠాలు ఈ కట్టడంలో ఇనుముడింప చేయటం జరిగింది.

పరాక్రమానికి ప్రతీక: ధర్మానికి, ధైర్యానికి, భక్తికి ప్రతీకగా శ్రీరాముడు గౌరవించబడ్డాడు, ఆలయాన్ని ఆ ఆదర్శాలకు నిదర్శనంగా నిర్మించారు.

ఇది ఒక వాస్తు శిల్ప అద్బుతం:

నిర్మాణం: గ్రాండ్ టెంపుల్ టౌన్ అనగా ప్రధాన ఆలయ ప్రాంగణం 2.7 ఎకరాల స్థలంలో ఉంది, ఆలయం 161 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, మొత్తం పొడవు 360 అడుగులతో ఉంటుంది. ఇది నగారా శైలిలో నిర్మించబడింది, నగారా శైలి అనేది ప్రాచీన భారతదేశంలోని పురాతన ఆలయ నిర్మాణ శైలిలలో ఒకటి.

వాస్తుశిల్పులు: చంద్రకాంత్ బి సోంపురా 81 సం, మరియు అతని కుమారుడు ఆశిష్ 51 సం, ఆలయ సముదాయాన్ని నాగరా శైలిలో నిర్మించారు. వీరే ఈ వాస్తు శిల్పానికి ఆజ్యం పోశారు.

మూడంతస్తుల వైభవం: ఈ ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి శ్రీరాముడి జీవితం మరియు ప్రాముఖ్యత కు సంబంధించిన విభిన్న అంశాలను ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు. ఆలయ నిర్మిత ప్రాంతం దాదాపు 57,000 చదరపు అడుగులు ఉంటుంది.

ప్రత్యేక నిర్మాణ సామగ్రి: ఈ నిర్మాణంలో రాజస్థాన్ నుండి పింక్ అనగా లేత గులాబీ రంగు ఇసుకరాయి, తెలంగాణా నుంచి బంగారు పూతతో టేకు చెక్క తలుపులు మరియు విగ్రహాల కోసం అరుదైన శాలిగ్రామ్ శిలలను ఉపయోగించారు.

పవిత్ర ఇటుకలు: భారతదేశం అంతటా భక్తులు విరాళంగా ఇచ్చిన 25 లక్షలు పైగా ప్రత్యేకంగా తయారు చేయబడిన “రామ నామము కలిగిన ఇటుకలు” ఈ నిర్మాణంలో ఉపయోగించబడ్డాయి.

ఆలయ రూపకల్పన లక్షణాలు: క్లిష్టమైన శిల్పాలు మరియు మండపాలు (హాల్స్) సాంప్రదాయ హిందూ నిర్మాణ శైలులను ప్రతిబింబిస్తాయి.

Ayodhya Ram Mandir



అయోధ్య రామమందిరం మరిన్ని ఆసక్తికరమైన వివరాలు: [Interesting facts about Ayodhya Ram Mandir in Telugu]

విగ్రహం యొక్క శిల్పి: అయోధ్య రామమందిరం లో ప్రతిష్టించిన రాముని విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్‌ కు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఎంతో కఠిన నిష్టతో ఆయన ఈ శిల్పాన్ని మలిచారు. అయోధ్యలోని రామమందిరంలో ఈ 51 అంగుళాల ఎత్తైన విగ్రహానికి జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట చేశారు.

రామప్ప ఆలయాన్ని పోలిన పునాది: ఆలయం యొక్క ఆధారం అయిన 14 మీటర్ల మందపాటి ప్రత్యేక శిలా ఫలకం పై నిర్మించబడింది, దీర్ఘాయువు మరియు భూకంప నిరోధకత తో దీనిని రూపొందించారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలంగాణ రామప్ప ఆలయం పునాదిని ఇందుకు ప్రామాణికంగా తీసుకున్నారు.

ఉక్కు లేదా ఇనుము లేదు: పురాతన హిందూ సంస్కృతికి అనుగుణంగా మరియు దీర్ఘాయువును పొందటానికి ఆలయ నిర్మాణంలో ఎక్కడా ఇనుము లేదా ఉక్కును వాడలేదు.

సోంపురాల వారసత్వం: ఆలయ నిర్మాణ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలను కలిగినటువంటి సోంపుర కుటుంబానికి చెందిన వాస్తు శిల్పులు ఈ రామ మందిరం రూపకల్పన లో పాలు పంచుకోవడం గొప్ప విషయం.

అంతర్జాతీయ సంజ్ఞ: భారతదేశం మరియు 121 దేశాలలోని 2,587 పుణ్యక్షేత్రాల నుండి పవిత్ర మట్టి పునాది లో కలపడం ఈ ఆలయానికి మరింత శక్తిని అందిస్తుందన్న విషయం గమనించాలి.

రాముడి దర్బార్: కేంద్ర బిందువు అయిన గర్భగుడిలో రాముడు, సీత, లక్ష్మణుడు మరియు భరతుల అద్భుతమైన విగ్రహాలు ఉంటాయి. వీటిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది.

భారతదేశంలో అతిపెద్ద దేవాలయ సముదాయం: పూర్తయిన తర్వాత, అయోధ్య రామమందిర సముదాయం 70 ఎకరాల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అవుతుంది. అయితే ప్రధాన ఆలయ స్థలం మాత్రం 2.7 ఎకరాల్లో ఉంది.

పర్యావరణ అనుకూలత : రామ మందిరం డిజైన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనగా వర్షపు నీటిని పునర్వినియోగించుకోవడం మరియు సోలార్ ప్యానెల్స్ తో సౌర శక్తిని ఉత్పత్తి చేయడం వంటి పర్యావరణ అనుకూల అనేక అంశాలు ఈ మందిరంలో ఉన్నాయి.

సాంస్కృతిక ప్రాముఖ్యత: ఆలయ నిర్మాణం మరియు ప్రారంభోత్సవం భారతీయ సంస్కృతి మరియు పర్యాటకంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.

అందరికీ తెరిచి ఉంటుంది: రాముడు అందరివాడు అంటారు కదా, ఈ ఆలయం అన్ని మతాల ప్రజలకు ప్రార్థనా స్థలంగా మరియు తీర్థయాత్ర ప్రాంతంగా విరాజిల్లుతుంది. మతాలకు కులాలకు అతీతంగా ఈ క్షేత్రం చరిత్రలో నిలువనుంది.

టైమ్ క్యాప్సూల్: దేవాలయ సముదాయంలో కళాఖండాలు మరియు భవిష్యత్తు తరాల కోసం సందేశాలను కలిగి ఉన్న టైమ్ క్యాప్సూల్ కాల చక్ర గుళిక ను పునాది కంటే ముందే భూమి లోపల భద్రపరచడం జరిగింది.

ఏకీకృత చిహ్నం: అయోధ్య రామమందిరం భారతదేశంలోని చాలా మందిలో ఆధ్యాత్మిక ఐక్యత మరియు ఏకీకృత స్థితిని స్థాపించడానికి దోహదపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

విరాళాలు: విరాళాల ఆధారంగా ఆలయం నిర్మించబడింది. రామ మందిర సామాగ్రి, రాముడి విగ్రహం, రాముని వస్త్రాలు, రామ పాదుకలు, రామమందిర ద్వార, ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కటి భక్తులచే విరాళంగా ఇవ్వబడ్డాయి.

అయోధ్య రామమందిరం గురించిన అనేక వాస్తవాలలో ఇవి కొన్ని మాత్రమే. ఈ రామ మందిరం వాస్తు శిల్పం, భక్తి మరియు సాంస్కృతిక మేలవింపుతో ఒక అద్భుతమైన కట్టడం గా మరియు పుణ్యక్షేత్రంగా చరిత్రలో విరాజిల్లుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జై శ్రీరామ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

error: Content is protected !!