గ్రీన్ టీ (Green Tea) ఇటీవల కాలంలో మన దేశంలో కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన టీ ఇది.
ఇది పేరుకే టీ, ఇందులో పాలు, చక్కర వంటివి ఏవి లేకుండా ఒక ఔషధం లాగా కేవలం గ్రీన్ టీ ఆకుల పొడి తో మాత్రమే తాగే ఈ తేనీరు కు చాలా ఔషద గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం మరియు అందంగా ఉండేందుకు ఈ టీ ఎంతగానో దోహద పడుతుంది.
చైనా మరియు ఇతర ఆసియా ప్రాంతాలలో పండించే కామెల్లియా సినెన్సిస్ అనే జాతి మొక్క యొక్క ఆకుల నుండి ఈ గ్రీన్ టీ పొడిని తయారు చేస్తారు. సాధారణ టీ లాగా దీనికి ప్రత్యేకంగా తయారీ విధానం అంటూ ఏమి లేదు. కేవలం గ్లాస్ వేడి నీటిలో ఈ గ్రీన్ టీ పొడి కానీ ప్యాకెట్ కానీ వేసి 5-10 నిమిషాలు ఆగి, కలుపుకొని తాగితే సరిపోతుంది. ఇంత సింపుల్ గా చేసుకునే ఈ టీ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మరి ఈ గ్రీన్ టీ తాగడం వలన కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేయండి
గుండె ఆరోగ్యానికి యాంటీ ఆక్సిడెంట్లు:
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ అని పిలవబడే హానికరమైన అణువుల నుంచి మన శరీరానికి హాని కలిగకుండా ఇవి కాపాడుతాయి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో దోహద పడతాయి. రక్త పోటు కూడా అదుపు లో ఉండేందుకు గ్రీన్ టీ సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించి, ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచేందుకు కూడా సహాయ పడతాయి.
బరువు తగ్గి స్లిమ్ గా ఉండేందుకు
గ్రీన్ టీ జీర్ణ క్రియ ను పెంచుతుంది. తద్వారా జీవ క్రియ మెరుగుపడి కొవ్వు తగ్గే అవకాశం ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇది అతిగా ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీనివలన మనిషి ఆరోగ్యకరమైన, పరిమితమైన ఆహారానికి అలవాటు పడేందుకు వీలు ఉంటుంది.
చురుకైన మెదడు పనితీరుకు
గ్రీన్ టీలోని కెఫిన్ మరియు అమైనో యాసిడ్ ఎల్-థియనైన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతాయి. జ్ఞాపకశక్తి, సగటు ప్రతిచర్య సమయం మరియు ఏకాగ్రత వంటివి మెరుగుపడతాయి.
దంతాల ఆరోగ్యానికి చక్కటి మార్గం
గ్రీన్ టీలో త్రాగడం వలన పళ్ళు పుచ్చిపోవడం ( కావిటీల) ను కొంతమేర నివారించవచ్చు. దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రీన్ టీ సహాయపదుతుంది.
మొత్తంమీద, గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆరోగ్యకరమైన మరియు దివ్యమైన పానీయం.
గ్రీన్ టీ ఎవరు తాగకూడదు ?
గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సమస్యలు, కడుపు పూత మరియు కొన్ని మానసిక రుగ్మతలు ఉన్నవారు గ్రీన్ టీ ని తీసుకోకూడదు. గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలు కూడా గ్రీన్ టీకి దూరంగా ఉండాలి.
Disclaimer: ఇక్కడ అందించబడిన కంటెంట్ కేవలం మీ సలహా కోసం మాత్రమే. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇవి వర్టించక పోవచ్చును. ఈ సలహాలు మీ డాక్టర్ సలహాలకు ఏమాత్రం ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. అంతిమ నిర్ణయం మీదే.