జూలై 14న ప్రారంభమైన చంద్రయాన్ 3 ప్రస్థానం ఆగస్టు 23 వరకు 40 రోజుల పాటు సుదీర్ఘంగా సాగి చంద్రుడి పై విజయవంతంగా ముగిసింది.
మొదటి రోజు నుంచి 45వ రోజు వరకు చంద్రయాన్ 3 ప్రయాణానికి సంబంధించిన ఆ ముఖ్యమైన ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.
40 రోజుల ప్రయాణం సాగిందిలా..
14 July 2023 – శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి పొగలు చిమ్ముతూ చంద్రయాన్ 3 నిగికి ఎగసింది. LVM 3 M4 రాకెట్ ద్వారా ఇస్రో చంద్రయాన్ 3 ని నింగిలోకి ప్రవేశపెట్టింది.
01-Aug-2023 : ట్రాన్స్ లునార్ (చంద్రుని బాహ్య ) కక్ష లోకి స్పేస్ క్రాఫ్ట్ ను విజయవంతంగా చేర్చడం జరిగింది.
05-Aug-2023 : తొలిసారి చంద్రయాన్ 3 ను విజయవంతంగా చంద్రుని కక్షలోకి ప్రవేశ పెట్టడం జరిగింది.
17-Aug-2023: ల్యాండర్ మాడ్యుల్ ను విజయవంతంగా ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరు చేయడం జరిగింది
23-Aug-2023 : ఆగస్టు 23 6.03 నిమిషాలకు చంద్రయాన్ 3 లాండర్ విక్రమ్ విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపింది.
చరిత్ర లిఖించిన భారత్..
చందమామపై కాలు మోపడం అనేది ఇప్పటివరకు మూడు దేశాలకే పరిమితం కాగా అందులో భారత నాలుగో దేశంగా చరిత్ర లో నిలిచింది. అయితే ఇప్పటివరకు కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి దక్షిణ ధృవం పై కాలు మోపటం ఇంతవరకు ఏ దేశానికి సాధ్యపడలేదు. ఇటీవల రష్యా లూనా 25 ద్వారా దక్షిణ ధృవం పై దిగేందుకు ప్రయత్నించినా అది ఫలించలేదు.
జాబిల్లి అవతలి భాగంపై తొలిసారి దిగిన దేశంగా భారత్ చరిత్ర లిఖించింది. దీంతో ఇప్పటికే ఇస్రో సత్తా గురించి ఎంతో కొంత తెలిసినటువంటి ప్రపంచ దేశాలకు చంద్రయాన్ 3 తో అసలు సత్తా బయట పడింది.